చిక్కుల్లో చిత్రపురి కాలనీ కమిటీ సభ్యులు.. ఒకేసారి 15 మందిపై కేసులు..

ప్రస్తుత కమిటీ, పాత కమిటీ కలిపి మొత్తం 21 మంది పైన కేసు నమోదైంది. నాన్ బెయిలబుల్ సెక్షన్ 120 B కింద..

చిక్కుల్లో చిత్రపురి కాలనీ కమిటీ సభ్యులు.. ఒకేసారి 15 మందిపై కేసులు..

Cases On Chitrapuri Colony Committee (Photo Credit : Google)

Cases On Chitrapuri Colony Committee : హైదరాబాద్ చిత్రపురి కాలనీ కమిటీ పైన సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ (EOW)లో 15 కేసులు నమోదయ్యాయి. చిత్రపురి కాలనీ నిర్మాణం, ఫ్లాట్ల అమ్మకాలపై గతంలో రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కస్తూరి ఆనంద్ ఫిర్యాదుతో కేసులు నమోదు చేశారు. ఇదే కేసులో చిత్రపురి కాలని కమిటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ ను గతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇపుడు ఇదే కేసు వందల కోట్లతో ముడిపడి ఉండటంతో ఎకనామిక్ అఫెన్స్ వింగ్ కి బదిలీ చేశారు.

చిత్రపురి కాలనీ ప్లాట్లను లబ్ధిదారులకి కాకుండా బయటివారికి కాలనీ కమిటీ అమ్ముకుంది. సినీ రంగానికి సంబంధం లేని వ్యక్తులకు ప్లాట్లు అమ్మారు. ప్రస్తుతం ఈ కమిటీపై ఒకేసారి 15 FIR లు నమోదు చేసింది ఎకనామిక్ అఫెన్స్ వింగ్. ప్రస్తుత కమిటీ, పాత కమిటీ కలిపి మొత్తం 21 మంది పైన కేసు నమోదైంది. నాన్ బెయిలబుల్ సెక్షన్ 120 B కింద కేసు నమోదైంది. చిత్రపురి కాలనీ కమిటీ సభ్యులుగా వల్లభనేని అనిల్, తమ్మారెడ్డి భరద్వాజ్, పరుచూరి వెంకటేశ్వరరావు, యాంకర్ దీప్తి వాజపేయి, వినోద్ బాల, కాదంబరి కిరణ్ ఉన్నారు.

Also Read : బాబోయ్.. ఎంబీబీఎస్ చదవకుండానే డాక్టర్ అయిపోయాడు, ఐదేళ్లుగా ప్రజలకు చికిత్స కూడా చేస్తున్నాడు..!