బాబోయ్.. ఎంబీబీఎస్ చదవకుండానే డాక్టర్ అయిపోయాడు, ఐదేళ్లుగా ప్రజలకు చికిత్స కూడా చేస్తున్నాడు..!

దొంగ వైద్యం చేస్తూ..పరిసర ప్రాంతాల అమాయక ప్రజల్ని మోసం చేస్తున్నాడని ఎస్‌వోటీ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు బిక్షపతి క్లినిక్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

బాబోయ్.. ఎంబీబీఎస్ చదవకుండానే డాక్టర్ అయిపోయాడు, ఐదేళ్లుగా ప్రజలకు చికిత్స కూడా చేస్తున్నాడు..!

Uppal Fake Doctor : వైద్యో నారాయణ హరీ అంటారు పెద్దలు. జబ్బు చేస్తే..వైద్యం చేస్తూ..ప్రాణాలు నిలబెడుతున్న డాక్టర్లంటే సమాజంలో ఓ గౌరవం..అభిమానం ఉంటుంది. అయితే ఈ అభిమానాన్ని కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. మిడి మిడి జ్ఞానంతో అరకొరగా వైద్యం నేర్చుకుని..విచ్చలవిడిగా వైద్యం చేస్తూ..జనాల ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ ఫేక్ డాక్టర్ బాగోతం బయటపడింది.

ఎంబీబీఎస్ చదవకుండానే డాక్టర్ అయిపోయాడు..
ఎంబీబీఎస్ చదవకుండానే డాక్టర్ అయిపోయాడు. డాక్టర్ అని పేరు చెప్పుకుని తిరిగితే పర్వాలేదు. కానీ ఏకంగా ఓ హాస్పిటలే పెట్టాడు. అందులో డాక్టర్ సర్టిఫికెట్ ఫ్రేమ్ కట్టి గోడకు వేలాడతీశాడు. అంతేనా ఐదేళ్లుగా ప్రజలకు చికిత్స చేస్తున్నాడు. అయితే ఇదెక్కడో పల్లెటూరిలో అనుకునేరు. స్వయంగా మన భాగ్యనగరంలో. అదీ ఫేమస్ అయిన ఉప్పల్‌ ప్రాంతంలో..ఈ ఫేక్ డాక్టర్..దందా సాగిస్తూ..జనాల ప్రాణాలతో ఆడుకుంటున్నాడు.

మిడిమిడి జ్ఞానంతో వైద్యం చేస్తూ ప్రాణాలతో చెలగాటం..
ఇతని పేరు కొయ్యలగూడెం బిక్షపతి. సొంతూరు చౌటుప్పల్ లింగోజిగూడెం. పీర్జాదిగూడలోని బాలాజీనగర్‌లో నివసిస్తున్నాడు. ఉప్పల్ అన్నపూర్ణ కాలనీ మండే మార్కెట్‌లో ప్రైవేట్ క్లినిక్ నడుపుతున్నాడు. ఎంబిబిఎస్ డాక్టర్ పేరుతో పర్మిషన్ తీసుకొని మణికంఠ పాలీ క్లినిక్ పేరుతో గత ఐదేళ్లుగా హాస్పిటల్‌ నడుపుతున్నాడు. ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసిన బిక్షపతి.. ఎంబీబీఎస్ నకిలీ సర్టిఫికెట్‌ తీసుకుని వైద్యం చేస్తున్నాడు. అర్హత లేకున్నా అమాయక ప్రజలను నమ్మించి మిడిమిడి జ్ఞానంతో వైద్యం చేస్తూ వారి ప్రాణాలతో చెలగాటమడుతున్నాడు.

దొంగ వైద్యం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నాడు..
ఎంఎస్‌సీ వరకు చదివిన బిక్షపతి.. వైద్యుడిగా మారి పరీక్షలు చేస్తూ..ప్రిస్క్రిప్షన్ రాస్తున్నాడు. అయితే దొంగ వైద్యం చేస్తూ..పరిసర ప్రాంతాల అమాయక ప్రజల్ని మోసం చేస్తున్నాడని ఎస్‌వోటీ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు బిక్షపతి క్లినిక్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అసలు బిక్షపతి ఎంబీబీఎస్ చదవకుండానే లైసెన్స్ లేకుండా క్లీనిక్ నడుపుతున్నాడని విచారణలో తేలింది. దీంతో ఫేక్ డాక్టర్ భిక్షపతిని SOT పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు మోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : వామ్మో..! పట్టాలపై రాళ్లు, సిమెంట్ దిమ్మెలు, గ్యాస్ సిలిండర్లు..! అసలేం జరుగుతోంది..