తెలంగాణలో కొత్తగా 1,531 కరోనా కేసులు

New Corona Cases Filed in Telangana: మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో కరోనా కరాళ నృత్యం కాస్త తగ్గినట్లుగానే అనిపిస్తుంది. ఈ క్రమంలో అక్టోబర్ 29వ తేదీ రాత్రి 8గంటల వరకు రాష్ట్రంలో 43వేల 790 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా అందులో 1,531 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,37,187కి చేరింది.
తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ ప్రకారం.. గురువారం ఒక్కరోజే రాష్ట్రంలో కరోనాతో ఆరుగురు చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 1,330కి చేరుకుంది. కరోనా నుంచి ఒక్క రోజే 1,048 మంది కోలుకోగా.. మొత్తం కోలుకున్న బాధితుల సంఖ్య 2,17,401కి చేరింది.
రాష్ట్రంలో ప్రస్తుతం 18,456 యాక్టివ్ కేసులు ఉండగా.. వారిలో 15,425 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 42,40,748కి చేరుకుంది.