Corona In Telangana : తెలంగాణలో కొత్తగా 188 కరోనా కేసులు, ఒకరు మృతి
తెలంగాణలో కొత్తగా 188 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో వైరస్ బారిన పడి ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 6,78,142కు చేరింది.

Ts Covid
new corona cases in Telangana : తెలంగాణలో కొత్తగా 188 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో వైరస్ బారిన పడి ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 6,78,142కు చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
రాష్ట్రంలో ఇప్పటివరకు 4,005 మరణాలు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 78 కరోనా కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 3,891 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న కరోనా నుంచి 193 మంది కోలుకున్నారు.
Corona Cases : ఏపీలో కొత్తగా 156 కరోనా కేసులు, ముగ్గురు మృతి
తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ టెన్షన్ పెడుతోంది. నిన్న విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ గా తేలింది. శుక్రవారం విదేశాల నుంచి తెలంగాణకు వచ్చిన 668 మదిలో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ ఇద్దరి శాంపిల్స్ ను అధికారులు జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపారు.
ఇప్పటివరకు విదేశాల నుంచి తెలంగాణకు 3,235 మంది ప్రయాణికులు వచ్చారు. వీరిలో ఇప్పటివరకు 15 మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో 13 మందికి ఒమిక్రాన్ నెగెటివ్ గా రిపోర్టు వచ్చింది.
Kurnool Market : కర్నూలు మార్కెట్ లో రైతు ఆగ్రహం.. సరైన ధర రాలేదని ఉల్లి పంటకు నిప్పు
భారత్ లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం రేపుతోంది. దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఢిల్లీలో ఒక ఒమిక్రాన్ కేసు నమోదు అయింది. దీంతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 33కు చేరింది.