Hyderabad : హైదరాబాద్ చైన్ స్నాచర్ల ఆగడాలు.. దొంగల కోసం 20 పోలీసు బృందాలు గాలింపు
హైదరాబాద్ చైన్ స్నాచర్ల ఆగడాలు మరోసారి హడలెత్తిస్తున్నారు. వీరిని పట్టుకోవటానికి 20 బృందాలుగా పోలీసులు గాలిస్తున్నారు.

20 police teams on the hunt for Hyderabad chain snatchers
Hyderabad : హైదరాబాద్ నగరంలో చైన్ స్నాచర్ల ఆగడాలకు అంతులేకుండాపోతోంది. మహిళల మెడ బంగారు గొలుసులు చాకచక్యంగా కొట్టేస్తున్నారు. ఇంటిముందే ఇటువంటి ఘటనలు జరగటం చైన్ స్నాచర్ల ఆగడాలు ఎంతగా ఉన్నాయో తెలుస్తోంది. చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. గంటల వ్యవధిలోనే ఏకంగా 6 చోట్ల చైన్ స్నాచింగ్ ఘటనలు చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. నగరంలోని ఉప్పల్, నాచారం, ఓయూ, రామ్ గోపాల్ పేటలో చైన్ స్నాచింగ్ ఘటనలు కేవలం గంటల వ్యవధిలోనే జరిగాయి.
వరుస ఘటనలతో అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగారు. చైన్ స్నాచర్లను పట్టుకోడానికి పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి..గాలింపు చర్యలు చేపట్టారు.చైన్ స్నాచర్లలో కొంతమందిని పట్టుకున్నారు. మిగతావారి కోసం గాలిస్తున్నారు. వీరిని పట్టుకోవటానికి పోలీసులు 20 బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. చైన్ స్నాచర్లు బైకులపై వచ్చి చోరీలు చేస్తున్నారు. ఆ బైక్ కూడా ఓ చోట చోరీ చేసింది కావటం గమనించాల్సిన విషయం. రామ్ కోటీలో ఓ బైక్ దొంగతనం చేసి ఆ బైక్ మీదనే జంట నగరాల్లో తిరుగుతు చైన్ స్నాచర్లకు పాల్పడుతున్నారు.
కాగా ఉన్నట్టుండి రెండు రోజుల క్రితం ఉదయం నుండి హైదరాబాద్ లో వరుస చోరీ ఘటనలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది. ఉప్పల్ నుండి మొదలు పెడితే ఓయూ, చిలకలగూడ రామాలయం, నాచారం, రామ్ గోపాల్ పేటలో వరుస చైన్ స్నాచింగ్ ఘటనలు జరిగాయి. ఉదయం 6 గంటల నుండి అర్ధ వరకు ఆయా ప్రాంతాల్లో దుండగులు చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు. మహిళలను టార్గెట్ చేస్తూ ఇంట్లోకి వెళ్తున్న లేదా రోడ్డుపై వెళ్తున్న వారి మెడలోంచి చైన్ లను లాగి బైక్ పై పారిపోయారు. ఈ ఘటనలన్నీ కూడా సీసీ ఫుటేజిలో రికార్డయ్యాయి. దుండగుల కోసం పోలీసులు 20 బృందాలను రంగంలోకి దింపగా సీసీ ఫుటేజీ ఆధారంగా వారి కదలికలను గమనిస్తున్నారు. ఇప్పటికే పలువురిని అదుపలోకి తీసుకోగా మిగిలినవారి కోసం గాలిస్తున్నారు.