Sputnik V Vaccine: రష్యా నుంచి చేరుకున్న మరో 30లక్షల వ్యాక్సిన్ డోసులు

రష్యా నుంచి మరో 30 లక్షల కొవిడ్ డోసుల స్పుత్నిక్ వీ హైదరాబాద్ చేరుకుంది. మంగళవారం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు వచ్చినట్లు జీఎమ్మార్ హైదరాబాద్ ఎయిర్ కార్గో వెల్లడించింది.

Sputnik V Vaccine: రష్యా నుంచి చేరుకున్న మరో 30లక్షల వ్యాక్సిన్ డోసులు

Sputnik V Vaccine (1)

Updated On : June 1, 2021 / 6:03 PM IST

Sputnik V Vaccine: రష్యా నుంచి మరో 30 లక్షల కొవిడ్ డోసుల స్పుత్నిక్ వీ హైదరాబాద్ చేరుకుంది. మంగళవారం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు వచ్చినట్లు జీఎమ్మార్ హైదరాబాద్ ఎయిర్ కార్గో వెల్లడించింది. స్పెషల్లీ ఛార్టెర్డ్ ఫ్రైటర్ RU-9450లో హైదరాబాద్‌కు 3గంటల 43నిమిషాలకు చేరుకుంది.

ఆల్రెడీ జీహెచ్ఏసీ అనేక మార్లు వ్యాక్సిన్ దిగుమతులు చేసింది. 56.6టన్నుల వ్యాక్సిన్ సింగిల్ లార్జెస్ట్ ఇంపోర్ట్ కూడా జరిగింది. ఈ షిప్మెంట్ ప్రక్రియ మొత్తం పూర్తి చేసుకుని డిస్పాచ్ అయ్యేసరికి 90నిమిషాల సమయం పట్టిందని అధికారులు అంటున్నారు.

స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ప్రత్యేకమైన స్టోరేజితో హ్యాండిల్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది మైనస్ 20డిగ్రీల దగ్గరే సురక్షితం. కస్టమ్స్ డిపార్ట్మెంట్ అధికారులు, ఇతర స్టాక్ హోల్డర్లు వ్యాక్సిన్ షిప్మెంట్ కోసం తగు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

రష్యన్ డైరక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ నుంచి నేరుగా డా. రెడ్డీస్ ల్యాబొరేటరీస్ 125 మిలియన్ డోసులు కొనుగోలు చేసింది. ఇండియన్ రెగ్యూలేటర్ నుంచి ఆంక్షలను ఎదుర్కొని ఎమర్జెన్సీ అప్రూవల్ కూడా దక్కించుకుంది. రీసెంట్ గా అపోలోతో ఒప్పందం కుదుర్చుకున్న డా. రెడ్డీస్ వ్యాక్సినేషన్ చేపట్టేదిశగా అడుగులు వేస్తోంది.