బాబోయ్.. 600 కిలోల చికెన్.. మందుబాబులే టార్గెట్.. అధికారుల తనిఖీల్లో భయంకరమైన విషయాలు.. ఎక్కడో తెలుసా?

నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్, కంటోన్మెంట్ బోర్డు అధికారులు సంయుక్తంగా గురువారం రెండు చికెన్ షాపులపై దాడులు చేశారు.

బాబోయ్.. 600 కిలోల చికెన్.. మందుబాబులే టార్గెట్.. అధికారుల తనిఖీల్లో భయంకరమైన విషయాలు.. ఎక్కడో తెలుసా?

Chicken Seized

Updated On : February 14, 2025 / 9:19 AM IST

Hyderabad: తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలను బర్డ్ ఫ్లూ భయపెడుతుంది. దీంతో చికెన్ తినేందుకు వెనుకడుగు వేస్తున్నారు. చికెన్ ధరలుసైతం అమాంతం పడిపోయాయి. కానీ, కొందరు చికెన్ షాపుల నిర్వాహకులు ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారు. బయట దొరికే చికెన్ ఫ్రై అంటే కొందరు లొట్టలేసుకొని తింటుంటారు. మందు బాబుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కల్లు కాంపౌండ్లు, మద్యం దుకాణాలు, బార్లలో మద్యం సేవించే సమయంలో స్టఫ్ గా చికెన్ ఫ్రై ని ఎక్కువగా తీసుకుంటుంటారు. వీరి బలహీనతను కొందరు ఆదాయంగా మార్చుకుంటున్నారు. రెండు, మూడు నెలలుగా నిల్వ ఉంచిన, కుళ్లిన చికెన్ ను కల్లు కాంపౌండ్, బార్లు, వైన్ షాపులకు సరఫరా చేస్తున్నారు.

Also Read: vallabhaneni vamsi: వల్లభనేని వంశీని విజయవాడలోని జిల్లా జైలుకు తరలింపు.. వంశీ సతీమణి పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్, కంటోన్మెంట్ బోర్డు అధికారులు సంయుక్తంగా గురువారం రెండు చికెన్ షాపులపై దాడులు చేశారు. ఈ దాడుల్లో రెండు మూడు నెలల నుంచి నిల్వ చేసిన 600 కిలోల కుళ్లిన చికెన్ ను స్వాధీనం చేసుకున్నారు. అన్నానగర్ లో రవి, అర్జున్ నగర్ లోని భాస్కర్ వారి చికెన్ దుకాణాల ద్వారా నిల్వచేసిన, కుళ్లిపోయిన చికెన్ ను కల్లు కాంపౌండ్, బార్లు, వైన్ షాపులకు సరఫరా చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో అధికారులు ఈ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నిల్వ ఉంచిన, కుళ్లిపోయిన మాంసాన్ని అధికారులు గుర్తించారు. రవి, భాస్కర్ ల షాపులను సీజ్ చేసి, వారిపై కేసు నమోదు చేశారు. కంటోన్మెంట్ బోర్డు యాక్టు ప్రకారం.. ఈ ఇద్దరిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. నిల్వ ఉంచిన, కుళ్లిపోయిన చికెన్ ను ఫ్రై చేసి మద్యం సేవించేందుకు వచ్చేవారికి విక్రయిస్తున్నారు.

Also Read: Bird flu: ఆ ఒక్క ప్రాంతంలో 4 లక్షలకు పైగా కోళ్లు మృతి.. తెలుగు రాష్ట్రాల్లో పడిపోయిన చికెన్‌ ధరలు

గతంలో ఇందిరమ్మనగర్ లో రవి చికెన్ షాపు నిర్వహిస్తూ నిల్వ చేసిన, కుళ్లిన చికెన్ సప్లయ్ చేస్తుండగా షాపు సీజ్ చేశామని, అయినా మళ్లీ అన్నానగర్ లో షట్టర్ తీసుకొని నిల్వ చేసిన చికెన్ ను తక్కువ ధరకు సప్లయ్ చేస్తున్నాడని అధికారులు తెలిపారు.