Heart Attack Constable Died : జిమ్ లో వ్యాయామం చేస్తూ గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

హైదరాబాద్ బోయిన్ పల్లిలో విషాదం చోటు చేసుకుంది. జిమ్ లో గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి చెందాడు. వ్యాయమం చేస్తుండగా 24 ఏళ్ల విశాల్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

Heart Attack Constable Died : జిమ్ లో వ్యాయామం చేస్తూ గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

DEAD (1)

Updated On : February 24, 2023 / 3:35 PM IST

Heart Attack Constable Died : హైదరాబాద్ బోయిన్ పల్లిలో విషాదం చోటు చేసుకుంది. జిమ్ లో గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి చెందాడు. వ్యాయమం చేస్తుండగా 24 ఏళ్ల విశాల్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. జిమ్ సిబ్బంది అతనిని వెంటనే హస్పిటల్ కి తరలించగా, అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు చెప్పారు. 2020లో కానిస్టేబుల్ గా ఎంపికైన విశాల్ ఆసిఫ్ నగర్ పీఎస్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు.

నిన్న (గురువారం) సాయంత్రం కానిస్టేబుల్ విశాల్ జిమ్ చేస్తూ మృతి చెందడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన తన విధులను ముగించుకొని ప్రతిరోజు సికింద్రాబాద్ లో ఓ జిమ్ లో తన స్నేహితులతో కలిసి జిమ్ చేస్తుంటాడు. రోజులాగే గురువారం జిమ్ కి వెళ్లిన విశాల్ ఒక్కసారిగా జిమ్ లో వ్యాయామం చేస్తూ కుప్పకూలిపోయాడు.

Man Died : జిమ్ లో వ్యాయామం చేస్తూ వ్యక్తి మృతి

విశాల్ కు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని, తాను ఎక్కువగా వర్కౌట్స్ చేయలేదని జిమ్ సిబ్బంది చెప్పారు. విశాల్ బోయిన్ పల్లిలో నివాసం ఉంటున్నారు. అతను 6 నెలల నుంచి జిమ్ చేస్తున్నాడని స్థానికులు, స్నేహితులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.