Bullet Bandi Song Fame Ashok : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన బుల్లెట్ బండి ఫేమ్ అశోక్

హైదరాబాద్ బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ అధికారి అశోక్ రూ.30వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు.

Bullet Bandi Song Fame Ashok : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన బుల్లెట్ బండి ఫేమ్ అశోక్

Updated On : September 20, 2022 / 7:02 PM IST

Bullet Bandi Song Fame Ashok : హైదరాబాద్ బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ అధికారి అశోక్ రూ.30వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. అశోక్ నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. గతంలో బుల్లెట్ బండి సాంగ్ కు డ్యాన్స్ చేయడంతో అశోక్ ఫేమస్ అయ్యాడు.

టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అశోక్.. బుల్లెట్ బండి సాంగ్ తో ఫేమస్ అయ్యారు. ఇవాళ ఏసీబీ అధికారులు చేసిన దాడుల్లో అశోక్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ఓ బిల్డింగ్ కు అనుమతి కోసం రూ.30వేలు లంచం తీసుకుంటూ ఉండగా.. అశోక్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో అశోక్ టౌన్ ప్లానర్ గా పని చేస్తున్నారు.

అశోక్ కార్యాలయంతో పాటు నివాసాల్లో సోదాలు చేస్తున్నారు. గతంలో అశోక్ పెళ్లి సమయంలో ఆయన భార్య బుల్లెట్ బండి సాంగ్ కి డ్యాన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ విధంగా అశోక్ కూడా ఫేమస్ అయ్యారు. అశోక్ పై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాఫ్తు చేస్తున్నారు.