Huzurabad By Poll : హుజూరాబాద్ ఉపఎన్నిక రద్దు కోసం కాంగ్రెస్ నేతల యత్నాలు
రేపు జరిగే హుజూరాబాద్ ఉన్న ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ ఏఐసీసీ నేతలు రంగంలోకి దిగారు.

Congresss Election Commission
Huzurabad By Poll : రేపు జరిగే హుజూరాబాద్ ఉన్న ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ ఏఐసీసీ నేతలు రంగంలోకి దిగారు. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలు వంశీచంద్ రెడ్డి, కుసుమకుమార్, దాసోజు శ్రవణ్, వేణుగోపాల రావులతో కలిసి కొందరు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి మాణిక్యం ఠాకూర్ లు నిన్న సాయంత్రం ఈసీ ని కలిశారు.
అధికార టీఆర్ఎస్, బీజేపీలు డబ్బు మద్యంతో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నాయని వారు ఈసీకి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అక్కడ ఉపఎన్నికలు స్వేఛ్చగాస పారదర్శకంగా జరిగే పరిస్ధితి లేదని కాంగ్రెస్ నాయకులు ఈసీకి వివరించారు. రేపు జరగాల్సిన ఉప ఎన్నికనువాయిదా వేసి మరోసారి పారదర్శకంగా ఎన్నికలు జరపాలని కాంగ్రెస్ నేతలు ఈసీని కోరారు.