Akbaruddin Owaisi: నన్ను చంపడానికి యత్నం.. అయినప్పటికీ..: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ భావోద్వేగభరిత వ్యాఖ్యలు
అది కూడా ఏ ప్రజల ముందు తనను చంపడానికి ప్రయత్నించారో ఆ ప్రజల సమక్షంలోనే వారిని క్షమిస్తున్నానని చెప్పారు.

Akbaruddin Owaisi
Akbaruddin Owaisi – Hyderabad: ఎంఐఎం (MIM) ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ భావోద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. కొన్నేళ్ల క్రితం తనను చంపేందుకు ప్రయత్నించిన వారిని క్షమిస్తున్నానని అన్నారు. అది కూడా ఏ ప్రజల ముందు తనను చంపడానికి ప్రయత్నించారో ఆ ప్రజల సమక్షంలోనే వారిని క్షమిస్తున్నానని చెప్పారు.
తనపై దాడి జరుగుతుంటే పట్టించుకోకుండా వెళ్లిన వారిని సైతం తాను క్షమిస్తున్నానని అక్బరుద్దీన్ ఒవైసీ తెలిపారు. అలాగే, అప్పట్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న తనను బతికించిన ఎమ్మెల్యే బలాలకు జీవితకాలం రుణపడి ఉంటానని అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు.
ఇవాళ బార్కస్ లో ఒవైసీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ (Owaisi School of Excellence) లో 11వ స్కూల్ భవనం ప్రారంభోత్సవానికి అక్బరుద్దీన్ ఒవైసీ వెళ్లారు. ఈ సందర్భంగానే మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి అక్బరుద్దీన్ సోదరుడన్న విషయం తెలిసిందే. అక్బరుద్దీన్ ఒవైసీపై 2011 ఏప్రిల్ 30న దాడి జరిగింది. అప్పట్లో కార్వాన్‌లో జరుగుతున్న ఓ కార్యక్రమానికి ఆయన వెళ్తున్న సమయంలో కొందరు కాల్పులు జరిపారు. కత్తులతోనూ దాడి చేశారు.
KA Paul : కేసీఆర్ బీజేపీతో గల్లిలో కొట్లాట.. ఢిల్లీలో దోస్తీ : కేఏ పాల్