మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన నాగచైతన్య.. ఏమన్నారో తెలుసా..

తన విడాకుల అంశం చాలా బాధకరమైన అంశం అని..

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన నాగచైతన్య.. ఏమన్నారో తెలుసా..

Akkineni Naga Chaitanya (Photo Credit : Google)

Updated On : October 3, 2024 / 12:28 AM IST

Akkineni Naga Chaitanya : మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నాగచైతన్య స్పందించారు. కొండా సురేఖ చేసిన ఆరోపణలు అబద్ధం, హాస్యాస్పదం అంటూ నాగచైతన్య అన్నారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు ఎంతమాత్రమూ ఆమోదనీయం కాదన్నారు. తన విడాకుల అంశం చాలా బాధకరమైన అంశం అని, దురదృష్టకరమైన అంశాల్లో ఒకటని నాగచైతన్య అభివర్ణించారు. తమ జీవితాలకు సంబంధించి కొండా సురేఖ చేసిన ఆరోపణలు అబద్ధం, అలాగే హాస్యాస్పదం అంటూ నాగచైతన్య రియాక్ట్ అయ్యారు.

”విడాకుల నిర్ణయం అనేది అత్యంత బాధాకరమైన, దురదృష్టకరమైన జీవిత నిర్ణయాలలో ఒకటి. చాలా ఆలోచించిన తర్వాత, నేను నా మాజీ జీవిత భాగస్వామి విడిపోవాలని పరస్పర నిర్ణయం తీసుకున్నాము. ఇది మా విభిన్న జీవిత లక్ష్యాల కారణంగా, ముందుకు సాగాలనే ఆసక్తితో శాంతియుతంగా తీసుకున్న నిర్ణయం. ఇద్దరూ పరిణతి చెందిన పెద్దలుగా తీసుకున్న డెసిషన్. అయితే, ఈ విషయంపై ఇప్పటివరకు అనేక నిరాధారమైన, పూర్తిగా హాస్యాస్పదమైన గాసిప్స్ వచ్చాయి. నా పూర్వపు జీవిత భాగస్వామితో పాటు నా కుటుంబం పట్ల ఉన్న గాఢమైన గౌరవంతో నేను ఇంతవరకు మౌనంగా ఉన్నాను.

నేడు మంత్రి కొండా సురేఖ చేస్తున్న వాదన అబద్ధం మాత్రమే కాదు, ఇది పూర్తిగా హాస్యాస్పదమైనది. ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదు. స్త్రీలు ఆదుకోవడానికి, గౌరవించబడటానికి అర్హులు. సెలబ్రిటీల వ్యక్తిగత జీవిత నిర్ణయాలను మీడియా హెడ్‌లైన్స్ కోసం ఉపయోగించుకోవడం సిగ్గుచేటు” అంటూ సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని తెలుపుతూ పోస్టు పెట్టారు అక్కినేని నాగ చైతన్య.

నాగచైతన్య-సమంత విడాకులకు మాజీ మంత్రి కేటీఆరే కారణం అంటూ మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే ఈ మ్యాటర్ పై అక్కినేని నాగార్జున కుటుంబసభ్యులు స్పందించారు. అక్కినేని నాగార్జున, అమల రియాక్ట్ అయ్యారు. మంత్రి కొండా సురేఖ ఆరోపణలను వారు తీవ్రంగా ఖండించారు. అందులో నిజం లేదన్నారు. మహిళ అయ్యి ఉండి మరో మహిళ గురించి అలా ఎలా మాట్లాడతారని మండిపడ్డారు. అటు కేటీఆర్ సైతం తీవ్రంగా స్పందించారు. మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపారు.

 

Also Read : కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన రోజా.. ఏమన్నారంటే..