కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన రోజా.. ఏమన్నారంటే..
కొండా సురేఖపై బీఆర్ఎస్ అనుయాయలు చేసిన పోస్టులను సమాజం వ్యతిరేకించింది.

Roja On Konda Surekha (Photo Credit : Google)
Roja : మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై మాజీ మంత్రి రోజా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. కొండా సురేఖ వ్యాఖ్యలను రోజా ఖండించారు. సమంతపై కొండా సురేఖ వ్యాఖ్యలు చాలా జుగుప్సాకరంగా ఉన్నాయని ధ్వజమెత్తారు రోజా. తోటి మహిళలపై అలాంటి వ్యాఖ్యలు చేయడానికి మనసెలా వచ్చింది అంటూ కొండా సురేఖను ప్రశ్నించారు. మీ రాజకీయాల్లోకి ఒక మహిళను తీసుకురావడం దుర్మార్గం అన్నారు రోజా.
”కొండా సురేఖపై బీఆర్ఎస్ నేతల పోస్టులను అందరూ వ్యతిరేకించారు. కానీ, తోటి మహిళపై హేయమైన వ్యాఖ్యలు చేయడానికి సురేఖకు మనసు ఎలా వచ్చింది? మీ రాజకీయ వివాదాల్లోకి మహిళను తీసుకురావడం దుర్మార్గం” అని రోజా అన్నారు.
”తెలంగాణ మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబం పై ప్రత్యేకించి సమంతపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. కొండా సురేఖపై బీఆర్ఎస్ అనుయాయలు చేసిన పోస్టులను సమాజం వ్యతిరేకించింది. ఆ సందర్భంగా తీవ్ర వేదనకు గురి అయిన కొండా సురేఖ.. అంతకన్నా హేయమైన వ్యాఖ్యలను తోటి మహిళపై చేయడానికి మనసు ఎలా అంగీకరించింది?
మీకు మీ ప్రత్యర్థులకు ఉన్న రాజకీయ వివాదాల్లోకి సంబంధం లేని మహిళను తీసుకురావడం అత్యంత దుర్మార్గం. ఆ పని మహిలే చేయటం మరింత బాధిస్తోంది. ఇలాంటి వేదనాభరిత పరిస్థితి నుంచి అక్కినేని నాగార్జున కుటుంబం, సమంత మనో ధైర్యంతో అధిగమిస్తుందని ఆశిస్తున్నా” అని ఎక్స్ లో పోస్టు పెట్టారు రోజా.
Also Read : నాగ చైతన్య విడాకులకు కేటీఆర్ కారణం.. కొండా సురేఖ సంచలన ఆరోపణలు..
తెలంగాణ మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబం పై ప్రత్యేకించి సమంతా పై చేసిన జుగుప్షకర వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కొండా సురేఖ పై @BRSparty అనుయాయలు చేసిన పోస్టులను సమాజం వ్యతిరేకించింది. ఆ సందర్భంగా తీవ్ర వేదనకు గురి అయిన @iamkondasurekha అంత కన్నా హేయమైన వ్యాఖ్యలను…
— Roja Selvamani (@RojaSelvamaniRK) October 2, 2024