Vikarabad Parigi : వికారాబాద్‌ పరిగిలో మందుబాబుల వీరంగం.. కుర్చీ కోసం బీరు సీసాలు, కర్రలతో దాడి

బీరు సీసాలతో, కర్రలతో దాడి చేసుకున్నారు. పర్మిట్ రూం నుంచి బయటకు వచ్చి వైన్స్ ముందు రోడ్డుపై వీరంగం సృష్టించారు. ఈ ఘటనలో ఇరువర్గాలకు గాయాలయ్యాయి.

Vikarabad Parigi : వికారాబాద్‌ పరిగిలో మందుబాబుల వీరంగం.. కుర్చీ కోసం బీరు సీసాలు, కర్రలతో దాడి

Attack

Updated On : March 19, 2022 / 8:30 PM IST

Alcohol drinkers attack : వికారాబాద్‌ పరిగిలో మందుబాబులు వీరంగం సృష్టించారు. వైన్‌షాపు పర్మిట్‌ రూమ్‌లో హంగామా సృష్టించారు. కుర్చీ కోసం ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణ కాస్తా చినికి చినికి గాలివానగా మారింది. తలలు పగలగొట్టుకునే వరకు వెళ్లింది. పరిగిలోని బహార్ పేట్ చౌరస్తాలో ఉన్న వీరభద్ర వైన్ షాప్ పర్మిట్ రూంలో శుక్రవారం సాయంత్రం మద్యం సేవించడానికి వచ్చిన యువకులు ఓ కుర్చీ కోసం ఒకరితో ఒకరు గొడవకు దిగారు.

బీరు సీసాలతో, కర్రలతో దాడి చేసుకున్నారు. పర్మిట్ రూం నుంచి బయటకు వచ్చి వైన్స్ ముందు రోడ్డుపై వీరంగం సృష్టించారు. ఈ ఘటనలో ఇరువర్గాలకు గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు స్థానికంగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గొడవ తర్వాత ఇరువర్గాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు.

Vikarabad : వికారాబాద్ జిల్లాలో ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద మృతి

మద్యం మత్తు దిగాక చేసిన తప్పు తెలుసుకుని కాంప్రమైజ్ అయ్యారు. కానీ ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో చేసేదేమిలేక పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పర్మిట్‌ రూమ్‌ల్లో సిట్టింగ్‌ నడుస్తుండటం విమర్శలకు దారితీసింది. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది.