Mlc Kavitha: అన్ని పార్టీల్లోనూ ఏదో ఒక వివాదం నడుస్తోంది, బీఆర్ఎస్ పై ప్రత్యేక దృష్టి అవసరం లేదు- ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు
ఎమ్మెల్సీ కవిత వ్యవహారం బీఆర్ఎస్ లో పెను సంచలన రేపిన సంగతి తెలిసిందే. కేసీఆర్ కు కవిత లేఖ రాయడం, అది లీక్ కావడం, దానిపై కవిత సీరియస్ గా స్పందించడం..

Mlc Kavitha: బీఆర్ఎస్ లో వివాదంపై ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క బీఆర్ఎస్ లోనే కాదు అన్ని పార్టీలోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. ఏదో ఒక వివాదం నడుస్తోందని చెప్పారు. కాంగ్రెస్ లో సీఎం రేవంత్ ఏదైనా మాట్లాడితే అరగంటలోనే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖండిస్తారని కవిత చెప్పారు. ఇక బీజేపీలోనూ ఇద్దరి మధ్య వివాదం నడుస్తోంది.
బండి సంజయ్ కు ఈటల రాజేందర్ వార్నింగ్ ఇస్తున్నారని తెలిపారు. ఇలా అన్ని పార్టీలో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుందన్నారు. బీఆర్ఎస్ పై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని కవిత స్పష్టం చేశారు. అల్టిమేట్ గా ప్రజలు బాగుండాలి, ప్రజలకు మేలు చేసే నాయకులు, పార్టీలు బాగుండాలి అని మేమే కోరుకుంటున్నాము, దాని కోసం అందరం కూడా ప్రయత్నం చేస్తాం అని కవిత అన్నారు.
ఎమ్మెల్సీ కవిత వ్యవహారం బీఆర్ఎస్ లో పెను సంచలన రేపిన సంగతి తెలిసిందే. కేసీఆర్ కు కవిత లేఖ రాయడం, అది లీక్ కావడం, దానిపై కవిత సీరియస్ గా స్పందించడం.. ఇలా అన్నీ వెనువెంటనే జరిగిపోయాయి. కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఆమె కొత్త రాజకీయ పార్టీ పెడతారనే టాక్ వినిపిస్తోంది.
కొన్ని రోజుల క్రితం కవిత తన తండ్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కి అంతర్గతంగా ఒక లేఖ రాశారు. అయితే ఆ లేఖ బహిర్గతమైంది. అంతే.. ఒక్కసారిగా రాజకీయ దుమారం రేగింది. కవిత రాసిన లేఖ బయటపడటంతో బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలున్నాయన్న విషయం స్పష్టమైందని కాంగ్రెస్, బీజేపీ వ్యాఖ్యానించాయి. కవిత లేఖను ఆధారంగా చేసుకుని బీఆర్ఎస్ ను టార్గెట్ చేశాయి.
కేసీఆర్ కు తాను లేసిన రాఖ వివాదంపై కవిత తీవ్రంగా స్పందించారు. తన తండ్రికి తానే లేఖ రాశానని ఆమె చెప్పారు. అంతర్గతంగా ఉంచాల్సిన విషయాన్ని బహిర్గతం చేశారని మండిపడ్డారు. ఈ క్రమంలో కేసీఆర్ దేవుడే..కానీ, ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు కవిత. అంతేకాదు పార్టీలో కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇలా కవిత వ్యవహారం బీఆర్ఎస్ లో ప్రకంపనలు రేపింది. కవిత బీఆర్ఎస్ ను వీడనున్నారనే ప్రచారం జోరందుకుంది. ఇక కేటీఆర్ ఇంట్లో రాఖీ పండగ వాతావరణం కనిపించలేదు. రాఖీ కట్టేందుకు కవిత వస్తానని చెప్పినా.. కేటీఆర్ ఔటాఫ్ స్టేషన్ వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది.