Bhu Bharati : తెలంగాణలో ఇక భూభారతి.. కొత్త చట్టం ప్రత్యేకత ఏంటి, రైతులకు కలిగే ప్రయోజనాలేంటి..

భూభారతి వెబ్ సైట్ రాబోయే వందేళ్ల వరకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సేవలు అందించేలా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Bhu Bharati : తెలంగాణలో ఇక భూభారతి.. కొత్త చట్టం ప్రత్యేకత ఏంటి, రైతులకు కలిగే ప్రయోజనాలేంటి..

Updated On : April 13, 2025 / 8:53 PM IST

Bhu Bharati : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భూభారతి సోమవారం నుంచి అమల్లోకి రానుంది. ముందుగా మూడు మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు కానుంది. జూన్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా భూభారతి సేవలు విస్తరించబోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఇదొకటి కాగా, ఈ భూభారతితో రైతులకు ఇప్పటివరకు ఎదురైన సమస్యలకు చెక్ పెట్టేలా భూభారతి పోర్టల్ రూపకల్పన జరుగుతోంది. అలానే ఈ కొత్త పోర్టల్ కనీసం వందేళ్ల పాటు నిరాటంకంగా సర్వీసులు అందించనుందని, దానికి తగిన భద్రత విధివిధానాలు రూపకల్పన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భూభారతి అమలుకు రంగం సిద్ధమైంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ధరణి పోర్టల్ స్థానంలో భూభారతి పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. తొలుత మూడు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించారు. పోర్టల్ పై అవగాహన కల్పించేందుకు అన్ని రైతుల మండలాల్లో సదస్సులు నిర్వహించనున్నారు.

Also Read : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేశారా? మీకు గుడ్‌న్యూస్‌.. మీ కల నెరవేరేది ఆ రోజే.

అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను విస్తరించనున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పోర్టల్ రైతులకు సులభంగా అర్థమయ్యేలా రూపొందించాలని ఆదేశించారు. అలానే భూభారతి వెబ్ సైట్ రాబోయే వందేళ్ల వరకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సేవలు అందించేలా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలానే సంస్థపై సైబర్ అటాక్స్, భద్రతా పరమైన కోణంలో ఫైర్ వాల్ సేఫ్టీ చూడాలని చెప్పారు. ఇందుకోసం ఓ మంచి సంస్థకి మెయింటైన్స్ ఇవ్వాలని సూచించారు.

మరోవైపు భూభారతి పోర్టల్ రైతులకు జూన్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకుని రావాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోర్టల్ పై అవగాహన కల్పించేందుకు అన్ని రైతుల మండలాల్లో సదస్సులు నిర్వహించనున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను విస్తరించనున్నారు. మండలాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రజలకు, రైతులకు భూభారతిపై అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. ఆయా సదస్సుల్లో ప్రజల నుంచి వచ్చే సందేహాలను నివృత్తి చేయాలని అధికారులకు సూచించారు.

Also Read : నాకు మంత్రి పదవి రాకుండా కుట్ర.. రాజగోపాల్ రెడ్డి సంచలనం..

సాధారణ పౌరులకు తమ భూమిపై హక్కులు, వివరాలు తెలుసుకోవాలంటే, రిజిస్ట్రేషన్స్ చేయించుకోవాలంటే ఇప్పటివరకు చాలా అవస్థలు ఎదుర్కొన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇందుకు వ్యవస్థలో పారదర్శకత లేకపోవడం, సాంకేతిక లోపాలు, రికార్డుల్లో అయోమయ పరిస్థితులు కారణాలుగా ఉండగా.. ఇదే విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం.. ప్రజల కోసం సులభమైన, స్పష్టమైన, సాంకేతికంగా ప్రగతిశీలమైన భూభారతి పోర్టల్ తీసుకొస్తోంది. ఈ పోర్టల్ ద్వారా భూమి రికార్డులు, పట్టాదారుల వివరాలు, మ్యుటేషన్ సమాచారం, రైతుబంధు అర్హతలు, భూమి ప్రయోజనాల స్థితిగతులు వంటి అనేక అంశాలు ఒక్క క్లిక్ తో లభించనున్నాయి.