Amit Shah : అమిత్ షా తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు

వరంగల్ సభ ముగించుకుని అమిత్ షా హైదరాబాద్ కు రానున్నారు. సాయంత్రం 6:10 గంటల నుంచి 6:40 గంటల వరకు కట్రీయా హోటల్ లో అమిత్ షా బీజేపీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు.

Amit Shah : అమిత్ షా తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు

Amit Shah Telangana Tour (1)

Amit Shah Telangana Election Campaign : బీజేపీ జాతీయ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. రేపు (శనివారం) మధ్యాహ్నం 12గంటలకు ప్రత్యేక విమానంలో అమిత్ షా బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12: 05కి హెలికాప్టర్ లో ఆయన గద్వాల్ కు బయల్దేరనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 1: 35 గంటల వరకు గద్వాల బహిరంగ సభలో ఆయన పాల్గొని, ప్రసంగించనున్నారు.

గద్వాల సభ అనంతరం అమిత్ షా నల్గొండకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2:55 గంటల నుంచి 3:30 గంటల వరకు నల్గొండ సభలో పాల్గొని, ప్రసంగించనున్నారు. సాయంత్రం 4:25 గంటల నుంచి 5:05 గంటల వరకు వరంగల్ సభలో అమిత్ షా పాల్గొని, మాట్లాడనున్నారు. వరంగల్ సభ ముగించుకుని అమిత్ షా హైదరాబాద్ కు రానున్నారు.

CM KCR : కాంగ్రెస్ డోకాబాజ్ పార్టీ .. పాల్త్ వాగ్దానాలు : సీఎం కేసీఆర్

సాయంత్రం 6:10 గంటల నుంచి 6:40 గంటల వరకు కట్రీయా హోటల్ లో అమిత్ షా బీజేపీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. సికిద్రాబాద్ క్లాసిక్ గార్డెన్ లో 6:45 గంటల నుంచి 7:45 గంటల వరకు ఎమ్మార్పీఎస్ నేతలతో షా సమావేశం కానున్నారు. పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. రాత్రి 8గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి అహ్మదాబాద్ కు అమిత్ షా తిరుగు ప్రయాణం కానున్నారు.