New Year Celebrations 2022 : బార్లు, పబ్‌ల యాజమానులకు పోలీసు కమీషనర్ వార్నింగ్

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బార్లు,  పబ్‌ ల యాజమాన్యాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ నగర పోలీసు కమీషనర్ అంజనీకుమార్ హెచ్చరించారు. 

New Year Celebrations 2022 : బార్లు, పబ్‌ల యాజమానులకు పోలీసు కమీషనర్ వార్నింగ్

New Year Clebrations 2022

New Year Celebrations 2022 : నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బార్లు,  పబ్‌ ల యాజమాన్యాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ నగర పోలీసు కమీషనర్ అంజనీకుమార్ హెచ్చరించారు.  మైనర్లకు లిక్కర్ అమ్మిన బార్లు , పబ్ లపై కఠిన చర్యలు ఉంటాయన్నారు.

Also Read : Call Data : యూజర్ల కాల్‌ డేటాపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు… రెండేళ్లు పాటు భద్రపరచాలి

నూతన సంవత్సర వేడుకలు సందర్భంగా ఆరోగ్య శాఖ ఇచ్చే సూచనల మేరకు కొన్ని చర్యలు తీసుకుంటామని.. డిసెంబర్ 31వ తేదీ రాత్రి నగరంలోని అనేక ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేపడతామని చెప్పారు. మద్యం సేవించి వాహనాల నడిపే వారిపై చర్యలు తీసుకుంటామని.. నూతన సంవత్సర వేడుకుల సందర్భంగా పిల్లల విషయంలో తల్లితండ్రులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. కోవిడ్ నిబంధనలుపాటిస్తూ ప్రతి ఒక్కరూ ప్రశాంతవాతావరణలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని అంజనీ కుమార్ ఆదేశించారు.