Basara IIIT Student Suicide : బాసర ట్రిపుల్ ఐటీలో మళ్లీ కలకలం.. మరో విద్యార్థి ఆత్మహత్య

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. పీ2 విద్యార్థి భానుప్రసాద్ సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు భాను ప్రసాద్.

Basara IIIT Student Suicide : బాసర ట్రిపుల్ ఐటీలో మళ్లీ కలకలం.. మరో విద్యార్థి ఆత్మహత్య

Updated On : December 19, 2022 / 1:03 AM IST

Basara IIIT Student Suicide : నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. పీ2 విద్యార్థి భానుప్రసాద్ సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు భాను ప్రసాద్. అయితే కళాశాల యాజమాన్యం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచింది. రహస్యంగా విద్యార్థి మృతదేహాన్ని అంబులెన్స్ లో తరలించారు. కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. భానుప్రసాద్ స్వస్థలం రంగారెడ్డి జిల్లా రంగాపూర్.

గత కొన్నాళ్లుగా బాసర ట్రిపుల్ ఐటీ తరచుగా వార్తల్లోకి ఎక్కుతోంది. ఏదో ఒక సమస్య బయటపడుతూనే ఉంది. వసతులు సరిగ్గా లేవంటూ ఆ మధ్యన కొన్ని రోజులు పాటు విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ట్రిపుల్‌ ఐటీలో ర్యాగింగ్‌ భూతం బుసలు కొట్టింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఆ తర్వాత విద్యార్థుల ఆత్మహత్యలు. ఇలా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ఈ పరిణామాలతో తోటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లల క్షేమం గురించి తల్లిదండ్రులు కంగారు పడుతున్నారు. చదువుకుని తమ పిల్లలు బాగుపడతారని తల్లిదండ్రులు ఆశిస్తే.. అక్కడ జరుగుతున్న సంఘటనలు కలవర పెడుతున్నాయి.