Self Lockdown : తెలంగాణలో మరోక గ్రామంలో సెల్ఫ్ లాక్‌డౌన్
ఒమిక్రాన్ తో రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరోక గ్రామంలో గ్రామస్తులు సెల్ఫ్ లాక్‌డౌన్ విధించుకున్నారు. ఇప్పటికే ముస్తాబాద్ మండలం గూడెం గ్రామస్తులు పది రోజుల పాటు సెల్ఫ్ లాక్ డౌన్ ప్రకట

Ts Self Lock Down
Self Lockdown : ఒమిక్రాన్ తో రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరోక గ్రామంలో గ్రామస్తులు సెల్ఫ్ లాక్‌డౌన్ విధించుకున్నారు. ఇప్పటికే ముస్తాబాద్ మండలం గూడెం గ్రామస్తులు పది రోజుల పాటు సెల్ఫ్ లాక్ డౌన్ ప్రకటించుకోగా కొత్తగా ఎల్లారెడ్డి పేట మండలం నారాయణపురం గ్రామస్థులు తీర్మానం చేసుకొని బుధవారం రోజు నుండి గురువారం వరకు రెండు రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించుకున్నారు.
రెండు రోజులు గ్రామంలోని అన్ని రకాల దుకాణాలు మూసి వేయడానికి తీర్మానించుకున్నారు. కిరాణా షాపులకు మాత్రం ఉదయం 10 గుంటల వరకు మరియు సాయంత్రం 6 గంటలు నుండి 8 గంటలు వరకు మినహాయింపు ఇచ్చుకున్నారు. నారాయణపురం కు చెందిన గల్ఫ్ కార్మికుడికి ఒమైక్రాన్ నిర్దారణ కావడంతో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా గ్రామ ప్రజలు ఈ నిర్ణయం తీసుకున్నారు