Revanth Reddy : కర్ణాటక ఎన్నికల ఫలితాలపై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..

కర్ణాటకలో బీజేపీ ఓడించి మోదీ‌ని, జేడీఎస్‌ను ఓడించి కేసీఆర్‌ను కర్ణాటక ప్రజలు తిరస్కరించారని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు.

Revanth Reddy : కర్ణాటక ఎన్నికల ఫలితాలపై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..

Anumula Revanth Reddy

Updated On : May 13, 2023 / 1:26 PM IST

Anumula Revanth Reddy : కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తుంది. 224 స్థానాల్లో ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు 123 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రాష్ట్రంలో స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే దిశగా కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తుంది. ఈ క్రమంలో తెలంగాణలోని కాంగ్రెస్ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు. గాంధీ భవన్ వద్ద టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం దాదాపు ఖరారైన నేపథ్యంలో తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి  నీలోఫర్ ఆంజనేయ స్వామి గుడిలో పూజలు నిర్వహించారు. అనంతరం కర్ణాటక ఫలితాలపై మాట్లాడారు.

DK Shivakumar : కర్ణాటకలో కాంగ్రెస్ దూకుడు .. పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ విజయం

కర్ణాటకలో బీజేపీ కుట్రలను ప్రజలు తిప్పికొట్టారని రేవంత్ రెడ్డి అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ వైపు స్పష్టమైన తీర్పు ఇస్తున్నారు. శ్రీరాముణ్ణి అడ్డుపెట్టుకుని పార్టీ విస్తరించాలనుకోవడం ఇప్పటికైన బీజేపీ మానుకోవాలి. కర్ణాటకలో భజరంగ్ బలిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలని చూశారు. శ్రీరాముణ్ణి అవమానించిన వారిని భజరంగబలి ఆశీర్వదించడు. కర్ణాటకలో బీజేపీ ఓడించి మోదీ‌ని, జేడీఎస్‌ను ఓడించి కేసీఆర్‌ను తిరస్కారించారు. కర్ణాటక తీర్పును కాంగ్రెస్ సాధరంగా స్వాగతిస్తున్నాం. దేశంలో ఇవే ఫలితాలు రాబోతున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు.

Bandla Ganesh : నా రాజకీయ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం.. కర్ణాటక ఫలితాల వేల బండ్ల గణేష్ సంచలన ట్వీట్స్..

తెలంగాణలోనూ స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రేవంత్ జోస్యం చెప్పారు. ఎంఐఎం విధానాన్ని ప్రజలంతా నిశితంగా గమనిస్తున్నారని అన్నారు. అనంతరం నీలోఫర్ హనుమాన్ టెంపుల్ నుంచి గాంధీ భవన్ వరకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ భవన్‌ వద్ద కాంగ్రెస్ నేతలు జైబజరంగ్ బలి నినాదాలు చేశారు. స్వీట్స్ తినిపించుకొని సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఠాక్రే‌కు, పీసీసీ చీఫ్ రేవంత్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ స్వీట్స్ తినిపించారు.