అక్కడికి వెళ్లము, ఇక్కడే ఉంటాం..!- క్యాట్‌‌ను ఆశ్రయించిన ఏపీ, తెలంగాణ ఐఏఎస్‌లు

ఈ నలుగురు ఐఏఎస్ లు వేసిన పిటిషన్ ను రేపు విచారించనుంది కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్.

అక్కడికి వెళ్లము, ఇక్కడే ఉంటాం..!- క్యాట్‌‌ను ఆశ్రయించిన ఏపీ, తెలంగాణ ఐఏఎస్‌లు

AP and Telangana IAS Officers (Photo Credit : Google)

Updated On : October 14, 2024 / 7:41 PM IST

IAS Officers : డీవోపీటీ ఉత్తర్వులను రద్దు చేయాలంటూ క్యాట్ లో నలుగురు ఐఏఎస్ లు పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణలోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఐఏఎస్ లు వాకాటి కరుణ, వాణి ప్రసాద్, ఆమ్రపాలి.. ఏపీలోనే కొనసాగించాలని ఐఏఎస్ సృజన కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. ఈ నలుగురు ఐఏఎస్ లు వేసిన పిటిషన్ ను రేపు విచారించనుంది కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్.

తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ లను ఇటీవలి కాలంలో డీవోపీటీ(డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనీ) వెంటనే ఆంధ్రప్రదేశ్ లో రిపోర్ట్ చేయాలంటూ ఓ సర్కులర్ ను జారీ చేసింది. డీవోపీటీ జారీ చేసిన ఈ సర్కులర్ ను సవాల్ చేస్తూ నలుగురు ఐఏఎస్ లు కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు.

రాష్ట్ర విభజన సమయంలో చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్ లను.. డీవోపీటీ.. ఏపీ, తెలంగాణకు కేటాయించింది. అప్పుడు డీవోపీటీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కొందరు ఐఏఎస్, ఐపీఎస్ లు క్యాట్ ని ఆశ్రయించారు. క్యాట్.. డీవోపీటీ ఉత్తర్వులపై గతంలో స్టే కూడా ఇచ్చింది. అయితే, క్యాట్ ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ డీవోపీటీ మళ్లీ హైకోర్టును ఆశ్రయించింది.

మాజీ డీజీపీ, ప్రస్తుత డీజీగా ఉన్న అంజనీ కుమార్ పిటిషన్ విషయంలో కావొచ్చు, మిగిలిన కొందరు ఐఏఎస్, ఐపీఎస్ లకు సంబంధించిన పిటిషన్లు ఇంకా హైకోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. తాజాగా డీవోపీటీ.. ఐదుగురు ఐఏఎస్ లకు ఉత్తర్వులు ఇచ్చింది. వాకాటి కరుణ, ఆమ్రపాలి, వాణి ప్రసాద్, రొనాల్డ్ రోస్, అంజనీ కుమార్.. వీరంతా వెంటనే ఏపీలో రిపోర్ట్ చేయాలని డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది.

దీన్ని సవాల్ చేస్తూ నలుగురు ఐఏఎస్ లు క్యాట్ ను ఆశ్రయించారు. వారి పిటిషన్ పై మంగళవారం క్యాట్ విచారించనుంది. క్యాట్ ఎలాంటి తీర్పు ఇస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది. డీవోపీటీ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని, తాము తెలంగాణలోనే కొనసాగేలా క్యాట్ ఉత్తర్వులు జారీ చేయాలని నలుగురు ఐఏఎస్ లు ఆమ్రపాలి, వాకాటి కరుణ, సృజన.. ఆశ్రయించారు. దీనిపై క్యాట్ ఎలాంటి తీర్పు ఇవ్వనుంది అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

 

Also Read : ఢిల్లీలో ధర్నా చేసేందుకు బీఆర్ఎస్ ప్లాన్..! టార్గెట్ ఎవరంటే..