Pawan Kalyan : కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పర్యటన వివరాలు ఇలా..

ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి తెలంగాణలో అడుగుపెట్టిన ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఘ‌న స్వాగ‌తం ప‌లికేందుకు జ‌న‌సైనికులు సిద్ధ‌మ‌య్యారు. హైద‌రాబాద్ నుంచి కొండ‌గ‌ట్టుకు వెళ్లే మార్గంలో ప‌వ‌న్ కు స్వాగ‌తం ప‌లికేలా జ‌న‌సేన నాయ‌కులు భారీ ఏర్పాట్లు చేశారు.

Pawan Kalyan : కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పర్యటన వివరాలు ఇలా..

AP Deputy CM Pawan Kalyan

Pawan Kalyan Kondagattu Temple Visit : జన‌సేన అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇవాళ జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు. ఉద‌యం 7 గంటలకు హైదరాబాద్‌ నుంచి బ‌య‌ల్దేరిన ప‌వ‌న్‌.. ఉద‌యం 11 గంటలకు కొండగట్టుకు చేరుకోనున్నారు. అనంత‌రం కొండగట్టు అంజన్నకు పవన్‌ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వ‌హిస్తారు. సుమారు గంటన్నర పాటు అంజన్న ఆలయంలో పూజా కార్య‌క్ర‌మాల్లో ప‌వ‌న్‌ పాల్గొంటారు. గతంలో మూడు సార్లు కొండగట్టు అంజన్నను ప‌వ‌న్ దర్శించుకున్నారు. గత ఏడాది వారాహి వాహనానికి కొండగట్టులో ప‌వ‌న్ పూజలు చేశారు. ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్.. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి కొండ‌గ‌ట్టు అంజ‌న్న స్వామి దర్శనం చేసుకోనున్నారు. ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌ల అనంతరం హైదరాబాద్‌కు తిరుగు పయనం అవుతారు.

Also Read : Dharmapuri Srinivas : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత

పవన్ పర్యటనకు సహకరించాలని అభిమానులకు పోలీసుల విజ్ఞప్తి చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి తెలంగాణలో అడుగుపెట్టిన ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఘ‌న స్వాగ‌తం ప‌లికేందుకు జ‌న‌సైనికులు సిద్ధ‌మ‌య్యారు. హైద‌రాబాద్ నుంచి కొండ‌గ‌ట్టుకు వెళ్లే మార్గంలో ప‌వ‌న్ కు స్వాగ‌తం ప‌లికేలా జ‌న‌సేన నాయ‌కులు భారీ ఏర్పాట్లు చేశారు. మ‌రోవైపు పవన్ తెలంగాణ పర్యటనకు రాజకీయ ప్రాాధాన్యం ఏర్ప‌డింది. తెలంగాణలో జనసేన బలోపేతంపై పవన్ దృష్టి సారించిన‌ట్లు తెలుస్తోంది. కొండగట్టు పర్యటన నుంచి వచ్చిన తరువాత తెలంగాణ జనసేన నేతలతో పవన్ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారని, ఇతర పార్టీల నుంచి జనసేనలోకి చేరిక‌లు ఉండ‌నున్న‌ట్లు సమాచారం.

Also Read : వైసీపీని కోలుకోలేని దెబ్బ తీశారా? పోలవరం శ్వేతపత్రంతో చంద్రబాబు అనుకున్నది సాధించారా?