AP Govt : ఏపీలోని రైతులకు గుడ్‌న్యూస్.. 46లక్షల మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు.. స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే?

Annadata sukhibhava : ఏపీలోని రైతులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ డబ్బులు జమ చేసేందుకు

AP Govt : ఏపీలోని రైతులకు గుడ్‌న్యూస్.. 46లక్షల మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు..  స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే?

Annadata Sukhibhav

Updated On : November 17, 2025 / 6:26 PM IST

Annadata sukhibhava : ఏపీలోని రైతులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ డబ్బులు జమ చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే అందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల 19వ తేదీన కడప జిల్లా కమలాపురంలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. అదేరోజు కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనుంది.

ఏపీలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్నదాత సుఖీభవ పేరుతో ప్రతీయేటా అర్హులైన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తోంది. ప్రతీయేటా మూడు విడుతల్లో రూ.14వేలు జమ చేయనుంది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రతీయేటా రూ.6వేలు మూడు విడుతల్లో విడుదల చేస్తోంది. దీంతో ఇప్పటికే తొలి విడతలో ఆగస్టు నెలలో రూ. 7వేలు (అన్నదాత సుఖీభవ కింద రూ.5వేలు, పీఎం కిసాన్ పథకం కింద రూ.2వేలు) రైతులు ఖాతాల్లో జమ అయ్యాయి. ప్రస్తుతం ఈనెల 19వ తేదీన రైతుల ఖాతాల్లో మరో రూ.7వేలు (అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.5వేలు, పీఎం కిసాన్ పథకం కింద రూ.2వేలు) జమ కానున్నాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 19న ‘పీఎం కిసాన్’ 21వ విడత నిధులను విడుదల చేయనున్నారు. నేరుగా రైతుల ఖాతాల్లో పెట్టుబడిసాయం కింద ఎకరాకు రూ.2 వేలు జమచేయనున్నారు. ఈ విడతతో కలిపి ఇప్పటి వరకూ రూ.3.70లక్షల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. దేశవ్యాప్తంగా 11 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు పీఎం కిసాన్ కింద ప్రయోజనం చేకూరనుంది.

ఇలా చెక్ చేసుకోండి..
రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద రూ.5వేలు, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద రూ.2వేలు ఈనెల 19వ తేదీన విడుదల చేయనుంది. అన్నదాత సుఖీభవ పథకం కింద 46లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు పడనున్నాయి. ఈ నేపథ్యంలో అన్నదాత సుఖీబవ పథకం స్టేటస్ చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందుకోసం రైతులు https://annadathasukhibhava.ap.gov.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.

వెబ్‌సైట్‌లోకి వెళ్లాక Know Your Status అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఆధార్ కార్డు నంబర్ వివరాలు అడుగుతుంది. ఆధార్ కార్డు నంబరు ఎంటర్, కాప్చా నమోదు చేసిన తర్వాత.. ఆ పక్కనే ఉన్న సెర్చ్ బటన్ నొక్కాలి. ఆ తరువాత అర్హుల వివరాలు కనిపిస్తాయి. రైతు పేరుతోపాటుగా జిల్లా, మండలం, గ్రామం వివరాలు తెలుస్తాయి. అలాగే పథకం స్టేటస్ కూడా తెలుస్తోంది. ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి అయిందా.. చేయించుకోవాలా అనే వివరాలు కూడా అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బులు పడ్డాయా లేదా అనే వివరాలతో పాటుగా ఏ బ్యాంకు అకౌంట్లోకి పడ్డాయనే వివరాలు కూడా తెలిసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.