కొండా దంపతులు కాంట్రవర్సీని కొని తెచ్చుకుంటున్నారా? నెక్ట్స్‌ ఏంటి?

అందులో వరంగల్ జిల్లాకు చెందిన కడియం, రేవూరి, నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణతో పాటు నేతలు ఎర్రబెల్లి స్వర్ణ, బస్వరాజ్‌ సారయ్య, ఇనుగాల వెంకట్రామిరెడ్డిలను కోట్ చేస్తూ వారిపై చేస్తూ విమర్శలు మరింత రచ్చ రాజేస్తున్నాయి.

కొండా దంపతులు కాంట్రవర్సీని కొని తెచ్చుకుంటున్నారా? నెక్ట్స్‌ ఏంటి?

Updated On : July 3, 2025 / 8:38 PM IST

ఓరుగల్లు పాలిటిక్స్‌లో కొండా దంపతుల రచ్చ కంటిన్యూ అవుతోంది. మొన్నటి వరకు సొంత పార్టీ ఎమ్మెల్యేలను టార్గెట్‌ చేసి వార్తల్లో నిలిచిన కొండా మురళి.. ఇప్పుడు అపోజిషన్‌ లీడర్లపై అటాక్ చేసి చర్చకు తెరలేపారు. ఏడాదిగా మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి ఏదో ఒక ఇష్యూతో కాంట్రవర్సీకి కేరాఫ్‌గా ఉంటున్నారు. కేటీఆర్‌ను టార్గెట్ చేయబోయి సమంతను మధ్యలోకి లాగి పెద్ద దుమారమే లేపారు కొండా సురేఖ. ఆ తర్వాత కొందరు మంత్రులు కమిషన్లు తీసుకుని ఫైల్స్ క్లియర్ చేస్తారు..తాను అలా కాదంటూ కాంట్రవర్సీకి కేరాఫ్‌ అయ్యారు.

ఇక ఈ మధ్య సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎదురు తిరిగిన వ్యవహారం..నిన్న రూ. 70 కోట్లు ఖర్చు చేసి గెలిచామన్న హాట్ కామెంట్..లేటెస్ట్‌గా మాజీ మంత్రి ఎర్రబెల్లి బ్రదర్స్ ఫ్యామిలీని టార్గెట్‌గా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. పరిమితి లేని పంచ్‌లతో కొండా మురళి ఇంటా, బయట అందరితో గెలుక్కుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఎర్రబెల్లి బ్రదర్స్ కుటుంబంలోని మహిళలపై కూడా కొండా మురళి కామెంట్ చేయడం విమర్శలకు దారి తీస్తోంది. కొండా మురళి పంచ్ డైలాగ్‌లు ఇటు పార్టీలో, అటు ప్రజల్లో ఆయనను పలుచన చేస్తున్నాయనే డిస్కషన్ నడుస్తోంది.

Also Read: ఇక న్యాయపోరాటమే అంటున్న గులాబీ టీమ్..! వీరికి లీగల్ నోటీసులు

ఎన్నికల్లో 70 కోట్లు ఖర్చు పెట్టామన్న కొండా మురళి వ్యాఖ్యలపై..ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదుల పరంపర కొనసాగుతుంది. తప్పుడు అఫిడవిట్‌తో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు మంత్రి సురేఖ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ నేత ప్రదీప్‌రావు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఈజీకి కంప్లైంట్ చేశారు. ఎన్నికల ఖర్చుపై తాను చేసిన కామెంట్స్ వివాదాస్పదమవుతున్న వేళ..ఎర్రబెల్లి ప్రదీప్ రావుపై కొండా మురళి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరో ఎదో చెప్తే దానికి భయపడి వెనక్కిపోయేది లేదని కామెంట్‌ చేశారు. ఎర్రబెల్లి కుటుంబమే ఓ దరిద్రమైన కుటుంబం…ఎర్రబెల్లి కుటుంబంలో పుట్టిన మహిళలు, పురుషులు దరిద్రులే అంటూ కొండా మురళి కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అవుతోంది.

ఎర్రబెల్లి కుటుంబంలోని మహిళలపై..
లైన్‌ దాటి కొండా మురళి పేలుస్తున్న పంచ్ డైలాగ్స్‌తో మంత్రి కొండా దంపతులు తరచూ వివాదాలకు కేరాఫ్ అవుతున్నారు. రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్న కొండా మురళి ఎర్రబెల్లి కుటుంబసభ్యులపై చేసిన వ్యాఖ్యలు ఇరకాటంలో పడేస్తున్నాయ్. తన భార్య కొండా సురేఖ ఒక సీనియర్ నేతగా, మహిళా మంత్రిగా, సీనియర్ ఎమ్మెల్యేగా రాజకీయాల్లో కొనసాగుతున్న తరుణంలో.. ఎర్రబెల్లి కుటుంబంలోని మహిళలపై కొండా మురళి చేసిన కామెంట్స్‌ విమర్శలకు దారి తీస్తోంది. త్వరలో కూతురు సుస్మిత పటేల్‌ రాజకీయ అరంగేట్రం చేస్తుందని ప్రకటిస్తూ వస్తున్న కొండా మురళి..ఇతర మహిళలను ఉద్దేశించి మాట్లాడిన మాటలతో సమాజానికి..కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్న మహిళలకు ఏం మెస్సేజ్ ఇస్తున్నారనే చర్చ జరుగుతోంది.

Also Read: లిక్కర్‌ ముడుపుల జప్తు.. టార్గెట్ పెద్దతలకాయేనా!? స్కాం కేసులో తెరపైకి కొత్త పేర్లు..

మ్యాటర్‌ ఏదైనా..ఇష్యూ మరేదైనా..ప్రత్యర్థి సొంత పార్టీ నేతలైనా..అపోజిషన్‌ పార్టీ లీడర్లు అయినా..ఒక్కతీరుగానే బాణాలు ఎక్కుపెడుతున్నారు కొండా దంపతులు. ఇంటా, బయట అందరిని గెలికి గొడవ పెట్టుకోవడం ఏంటంటూ ఓరుగల్లు పాలిటిక్స్‌లోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లోనూ డిస్కషన్ జరుగుతోంది. సొంత పార్టీ నేతలతో గొడవ..ప్రతిపక్ష పార్టీ నేతలతో పొసగదు..ఇక కొండా దంపతులు ఎవరితో సఖ్యతతో ఉంటారంటూ విమర్శలు వస్తున్న పరిస్థితి.

ఒకప్పుడు ఫైర్‌ బ్రాండ్‌ లీడర్స్‌గా..వాళ్ల పేరు చెప్తే ఓ నేమ్‌ ఫేమ్ ఉండే ఆ దంపతులు..కొన్నిరోజులుగా అనవసర విషయాల జోలికి వెళ్లి..అడ్డగోలు కామెంట్స్ చేసి ఇరకాటంలో పడుతున్నారన్న చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ స్టేట్‌ ఇంచార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ను కలిసి కొండా దంపతులు ఈ చర్చకు ఎండ్‌ కార్డు వేస్తారని అంతా భావించారు. అయితే ఆమెకు ఇచ్చిన 16 పేజీల లేఖ మరో దుమారం లేపుతోంది.

అందులో వరంగల్ జిల్లాకు చెందిన కడియం, రేవూరి, నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణతో పాటు నేతలు ఎర్రబెల్లి స్వర్ణ, బస్వరాజ్‌ సారయ్య, ఇనుగాల వెంకట్రామిరెడ్డిలను కోట్ చేస్తూ వారిపై చేస్తూ విమర్శలు మరింత రచ్చ రాజేస్తున్నాయి. వాళ్లకు అసలు రాజకీయ స్థిరత్వం..జిల్లాలో ఎలాంటి ప్రభావం చూపించేస్థాయి లేదనేలా మీనాక్షికి రాసిన లేఖలో కొండా దంపతులు పేర్కొనడం హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల ఖర్చుపై కొండా మురళి చేసిన కామెంట్స్‌పై చర్యలు ఉంటాయా.? ఎర్రబెల్లి కుటుంబంలోని మహిళలపై చేసిన కామెంట్స్‌ వివాదం ఎటువైపు దారి తీస్తుందో చూడాలి మరి.