Food Business : మీరు ఫుడ్ బిజినెస్ మొదలు పెడుతున్నారా? లైసెన్స్ ఎలా పొందాలో ఇక్కడ తెలుసుకోండి

ఎఫ్ఎస్ఎస్ఏఐ అంటే భారతదేశంలోని మొత్తం ఆహార వ్యాపారాన్ని పర్యవేక్షించి నియంత్రించే సంస్థ. భారత ప్రభుత్వంలోని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ కింద

Food Business : మీరు ఫుడ్ బిజినెస్ మొదలు పెడుతున్నారా? లైసెన్స్ ఎలా పొందాలో ఇక్కడ తెలుసుకోండి

Food Business

Updated On : December 6, 2023 / 9:48 AM IST

Food Business Licence : ఆహార ఉత్పత్తుల తయారీ, ప్రాసెసింగ్, విక్రయం, ఎగుమతి వంటి ఆహార వ్యాపారంలో పాల్గొన్న ప్రతీవ్యక్తి తప్పనిసరిగా లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. అయితే, చాలామంది ఫుడ్ వ్యాపారం ప్రారంభించేందుకు సిద్ధమైనప్పటికీ లైసెన్స్ పొందడం ఎలాగో తెలియక ఇబ్బంది పడుతుంటారు. మధ్యవర్తులను సంప్రదింస్తుంటారు. కానీ, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ద్వారా నెల రోజుల్లోనే లైసెన్స్ తీసుకోవచ్చు. ఫుడ్ వ్యాపార రంగంలో ప్రవేశించేవారు తప్పనిసరిగా ఎఫ్ఎస్ఎస్ఏఐ నమోదును కలిగి ఉండాలి. ఎఫ్ఎస్ఎస్ఏఐ రిజిస్ట్రేషన్ అనేది.. భారతదేశంలో రెస్టారెంట్ బ్రేకరీ, ఫుడ్ స్టాల్స్ ను తెరవాలనుకునే వారికి ముఖ్యమైన రిజిస్ట్రేషన్ లలో ఒకటి.

Also Read : Maxima Max Pro Hunt : మ్యాక్సిమా మాక్స్ ప్రో హంట్ స్మార్ట్‌వాచ్‌ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?

ఎఫ్ఎస్ఎస్ఏఐ అంటే భారతదేశంలోని మొత్తం ఆహార వ్యాపారాన్ని పర్యవేక్షించి నియంత్రించే సంస్థ. భారత ప్రభుత్వంలోని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ కింద స్థాపించబడిన స్వయంప్రతిపత్తి సంస్థ. ఆహార కల్తీ, నాణ్యతలేని ఉత్పత్తుల విక్రయాలను అరికడుతుంది. ఆహార వ్యాపారంలోకి వచ్చేవారు ఎలాంటి నియమాలు, నిబంధనలు పాటించాలి, వారు ఎలాంటి రిజిస్ట్రేషన్, లైసెన్స్ పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం.