Arekapudi Gandhi : దమ్ముంటే రా.. లేకుంటే నేనే వస్తా.. కౌశిక్ రెడ్డిపై అరికపూడి గాంధీ ఫైర్
కౌశిక్ రెడ్డిపై అరికెపూడి గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కౌశిక్ రెడ్డి వల్లే బీఆర్ఎస్ పార్టీ నాశనం అయిందన్నారు. దమ్ముంటే ఉదయం 11గంటలకు కౌశిక్ రెడ్డి తన ఇంటికి రావాలని,

Arekapudi Gandhi
Arekapudi Gandhi vs Padi Kaushik Reddy : సవాళ్లు ప్రతిసవాళ్లతో పీఏసీ చైర్మన్ అరికపూడి గాంధీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం హాట్ టాఫిక్ గా మారింది. ఉదయం 11గంటలకు అరికపూడి గాంధీ ఇంటికివెళ్లి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుతానంటూ కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు. దీంతో గాంధీ ఇంటి ముందు పోలీసులు భద్రతను పెంచారు. ముందుగా జాగ్రత్తగా ఆయన ఇంటికి వెళ్లేదారుల్లో బారికేడ్లతోపాటు.. భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు.
Also Read : బీజేపీలో నేతల మధ్య తీవ్రమవుతున్న కలహాలు..! కారణం అదేనా..
మరోవైపు కౌశిక్ రెడ్డిపై అరికెపూడి గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కౌశిక్ రెడ్డి వల్లే బీఆర్ఎస్ పార్టీ నాశనం అయిందన్నారు. దమ్ముంటే ఉదయం 11గంటలకు కౌశిక్ రెడ్డి తన ఇంటికి రావాలని, లేదంటే మధ్యాహ్నం 12గంటలకు నేను ఆయన నివాసానికి వెళ్తానంటూ గాంధీ అన్నారు. ఇద్దరి దమ్మేంటో తేల్చుకుందాం రా.. అంటూ సవాల్ చేశారు. నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేను, అసెంబ్లీలో స్పీకర్ ప్రకటించారు. అభివృద్ధి పనులకోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిశాను. కేసీఆర్ మాట్లాడితే సమాధానం చెబుతానని అరికెపూడి గాంధీ అన్నారు.
Also Read : అయ్యో పాపం.. వయనాడ్ బాధితురాలు శ్రుతి జీవితంలో మరో అంతులేని విషాదం..
సవాళ్లు, ప్రతిసవాళ్ల మధ్య ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడంతో.. హైదరాబాద్ లోని హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉత్కంఠ నెలకొంది. పెద్దెత్తున పోలీసులు ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. కౌశిక్ రెడ్డిని పోలీసులు గృహనిర్భందం చేసినట్లు తెలుస్తోంది. ఏక్షణమైనా ఆయన్ను అరెస్టు చేసే అవకాశం ఉంది.