వీరుడా వందనం : ర్యాడ మహేష్ అంత్యక్రియలు పూర్తి

Army Jawan Ryada Mahesh Funeral
Army Jawan Ryada Mahesh Funeral : కోమన్ పల్లిలో వీరజవాన్ ర్యాడ మహేష్ అంత్యక్రియలు ముగిశాయి. అంతిమయాత్రలో ప్రభుత్వం తరపున వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. అధికార, సైనిక లాంఛనాలతో మహేష్ అంత్యక్రియలు జరిగాయి. ఈ అంతిమయాత్రకు ప్రజలు భారీగా తరలివచ్చారు. కుమారుడి చితికి తండ్రి నిప్పంటించాడు. గౌరవ సూచకంగా మూడు రౌండ్లు గాలిలోకి ఆర్మీ జవాన్లు కాల్పులు జరిపారు.
కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి :-
జవాన్ మహేశ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన యోధుడిగా మహేశ్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. జవాన్ మహేశ్ కుటుంబానికి ప్రభుత్వ పరంగా రూ.50 లక్షల ఆర్థిక సహాయం, అర్హతను బట్టి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఇంటి స్థలం కూడా కేటాయిస్తామని ప్రకటించారు.
https://10tv.in/martyred-jawans-funeral-with-full-honours/
తెలుగు రాష్ట్రాల ఇద్దరు జవాన్లు :-
జమ్మూ-కశ్మీర్ మాచిల్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంట జరిగిన ఎదురుకాల్పుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు జవాన్లు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. వీరితో పాటు ఓ సైనికాధికారి, మరో బీఎస్‌ఎఫ్ జవాను సైతం ప్రాణాలు కోల్పోయారు. చొరబాటుకు యత్నించిన ముష్కరులను అడ్డుకునే క్రమంలో ఈ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.
మహేష్ ది నిజామాబాద్ జిల్లా :-
అయితే ముగ్గురు ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. ప్రాణాలు కోల్పోయిన సైనికుల్లో తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్‌పల్లి గ్రామానికి చెందిన జవాను ర్యాడా మహేష్, ఏపీలోని చిత్తూరు జిల్లా రెడ్డివారిపల్లెకు చెందిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు.
శోక సంద్రంలో కుటుంబసభ్యులు :-
చొరబాటుదార్లకు, భద్రత బలగాలకు జరిగిన ఎదురుకాల్పుల్లో తెలంగాణ జవాన్ మహేష్ ప్రాణాలు విడిచాడు. తొలుత మహేష్‌కు తీవ్ర గాయాలు అయినట్టు ఆర్మీ అధికారులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత మహేష్ ఉగ్రదాడిలో వీరమణం పొందినట్టు తెలిపారు. దీంతో అతని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.