V Hanumantha Rao : తెలంగాణ ఇవ్వకుంటే మీ కుటుంబం ఎక్కడుండేది- సీఎం కేసీఆర్ పై వీహెచ్ ఫైర్

VH Questions CM KCR : ధరణి పేరుతో గరిబోళ్లకు, ఎస్సీ, ఎస్టీలకు ఇందిరమ్మ ఇచ్చిన భూములు గుంజుకుంటున్నారు. ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్

V Hanumantha Rao : తెలంగాణ ఇవ్వకుంటే మీ కుటుంబం ఎక్కడుండేది- సీఎం కేసీఆర్ పై వీహెచ్ ఫైర్

VH Questions CM KCR (Photo : Google)

సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు. హైదరాబాద్ గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఇవ్వకుంటే మీ కుటుంబం ఎక్కడుండేది అని సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు వీహెచ్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడితే అభివృద్ధి అంటారు, గజ్వేల్ లో 144 నామినేషన్లు వచ్చాయంటే మీ పై ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టమవుతుందని వీహెచ్ అన్నారు. దీన్ని బట్టి అభివృద్ధి లేదని తేలిపోయిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఓడిపోతాడిని ప్రజలు చెబుతున్నారు అని వీహెచ్ చెప్పారు.

”ధరణిపై ముఖ్యమంత్రి మాటలు హాస్యాస్పదం. ధరణి పేరుతో గరిబోళ్లకు, ఎస్సీ, ఎస్టీలకు ఇందిరమ్మ ఇచ్చిన భూములు గుంజుకుంటున్నారు. పంచవర్ష ప్రణాళికలతో అభివృద్ధి చేసింది కాంగ్రెస్. ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్. తెలంగాణ ఇవ్వకుంటే మీ కుటుంబం ఏడుండు ముఖ్యమంత్రి? అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ. నిజాం షుగర్ ఫ్యాక్టరీ, కాగజ్ నగర్ పేపర్ మిల్లు తెరిపించావా?

Also Read : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో వారసులు.. సత్తా నిరూపించుకుంటారా?

నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. దళితబంధులో 30శాతం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో 20శాతం కమీషన్ తీసుకున్నారు. పదేళ్ల నుండి బీసీలకు బీజేపీ, ప్రధాని మోదీ ఏమీ చేయలేదు. ఇప్పుడు మాత్రం బీసీ ముఖ్యమంత్రి అంటున్నారు. ప్రజల దగ్గరికి వెళ్తున్నా. ప్రభుత్వాల వైఫల్యాలను నా యాత్ర ద్వారా తెలియజేస్తా. రైతులకు సంకెళ్లు వేసిన వారు రైతుల గురించి మాట్లాడడం విడ్డూరం. కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు ఖాయం” అని వీహెచ్ అన్నారు.

Also Read : పార్టీ మార్పుపై విజయశాంతి క్లారిటీ ఇచ్చినట్లేనా? ఆ మార్పులు దేనికి సంకేతం .. మరోసారి చర్చనీయాంశంగా విజయశాంతి పార్టీ మార్పు అంశం..