Vijayashanti : పార్టీమార్పుపై విజయశాంతి క్లారిటీ ఇచ్చినట్లేనా? ఆ మార్పులు దేనికి సంకేతం .. మరోసారి చర్చనీయాంశంగా విజయశాంతి పార్టీ మార్పు అంశం..

తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ మహిళా నేత విజయశాంతి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. కొద్దికాలంగా ఆమె బీజేపీని వీడుతున్నారని విస్తృత ప్రచారం జరిగింది. త్వరలోనే ఆమె కాంగ్రెస్ గూటికి చేరబోతున్నట్లు జోరుగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

Vijayashanti : పార్టీమార్పుపై విజయశాంతి క్లారిటీ ఇచ్చినట్లేనా? ఆ మార్పులు దేనికి సంకేతం .. మరోసారి చర్చనీయాంశంగా విజయశాంతి పార్టీ మార్పు అంశం..

Vijayashanti

Updated On : November 14, 2023 / 8:42 AM IST

Telangana BJP Leader Vijayashanti : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరింది. అధికారమే లక్ష్యంగా ముందుకెళ్తున్న బీజేపీ అభ్యర్థులు, నేతలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు ప్రచార పర్వంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ప్రధాని పలు దఫాలుగా తెలంగాణలో పర్యటించిన విషయం తెలిసిందే. అధికారంలోకి రావడమే టార్గెట్ గా పెట్టుకున్న బీజేపీ అధిష్టానంకు ఆ పార్టీ నేతలు షాక్ లు ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు కీలక నేతలు బీజేపీని వీడగా.. తాజాగా ఆ పార్టీ మహిళా నేత విజయశాంతిసైతం పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతుంది.

Also Read : Assembly Elections 2023: ఓబీసీ కోటాపై మాటల యుద్ధం.. రాహుల్ గాంధీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ

తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ మహిళా నేత విజయశాంతి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. కొద్దికాలంగా ఆమె బీజేపీని వీడుతున్నారని విస్తృత ప్రచారం జరిగింది. త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరబోతున్నట్లు జోరుగా ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. ఈ ప్రచారం ఇలా సాగుతుండగానే కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఇటీవల మాట్లాడుతూ.. విజయశాంతి కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారని తెలిపారు. దీంతో ఆమె కాంగ్రెస్ లోకి వెళ్లడం ఖాయమని అందరూ భావించారు. అయితే, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరిగిన ప్రధాని మోదీ సభకు విజయశాంతి హాజరు కావడంతో ఆమె పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారానికి చెక్ పడినట్లయింది.

Also Read : Telangana Polls: తెలంగాణలో 594 అప్లికేషన్లు రిజెక్ట్.. లిస్టులో జానారెడ్డి, ఈటెల జమున

విజయశాంతి కొద్దికాలంగా రాష్ట్ర బీజేపీలో జరుగుతున్న పరిణామాలపట్ల అసంతృప్తితో ఉన్నారని ఆ పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. దీనికితోడు పలుసార్లు సామాజిక మాధ్యమాల్లో ఆమె పెట్టిన పోస్టులుసైతం ఆ విషయాన్ని తేటతెల్లం చేశాయి. మరోవైపు తెలంగాణ ఎన్నికలకోసం 40మందితో బీజేపీ అధిష్టానం స్టార్ క్యాపెయిన్ లిస్ట్ ను ఇటీవల రిలీజ్ చేసింది. ఈ లిస్ట్ లో విజయశాంతి పేరు లేకపోవటం ఆ పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. తాను బీజేపీని వీడటం లేదని విజయశాంతి ఇటీవల స్పష్టంత ఇచ్చినప్పటికీ.. తాజాగా ఆమె ట్విటర్, ఫేస్ బుక్ ఖాతాల్లో ప్రొఫైల్ పిక్ మార్చడంతో బీజేపీని వీడటం ఖాయమన్న ప్రచారం మరోసారి తెరపైకి వచ్చింది.

ట్విటర్ , ఫేస్ బుక్ లో ప్రొఫైల్ పిక్ మార్చిన విజయశాంతి.. బీజేపీలో చేరకుముందు ఉన్న డీపీని మళ్లీ పెట్టింది. దీంతో డీపీ మార్పు దేనికి సంకేతం అనేచర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. గత కొంతకాలంగా బీజేపీపై అంసతృప్తితో ఉన్న విజయశాంతి ఈనెల 11న ప్రధాని హైదరాబాద్ పర్యటన సందర్భంగా మోదీని కలిశారు. అందుకు సంబంధించిన ఫొటోలనుకూడా ఆమె ఎక్కడా షేర్ చేయకపోవటంతో పాటు, ప్రస్తుతం నరేంద్ర మోదీ పొటోతో కలిపి ఉన్న డీపీనిసైతం మార్చడంతో ఆమె బీజేపీని వీడటం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి విజయశాంతి బీజేపీని వీడుతుందా? వీడితే ఆమె ఏ పార్టీలో చేరుతారనే విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.