Rangareddy District: హైదరాబాద్‭ను పట్టాలంటే రంగారెడ్డిని కొట్టాలి.. కారు, హస్తం పందెంలో విజేత ఎవరు?

బీఆర్‌ఎస్‌ నుండి గెలిచిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. అంతేకాదు గత ఎన్నికల్లో ఏనుగు గుర్తుతో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన మల్‌రెడ్డి రంగారెడ్డి.. ఈ సారి చేతి గుర్తుతో బరిలోకి దిగుతున్నారు

Rangareddy District: హైదరాబాద్‭ను పట్టాలంటే రంగారెడ్డిని కొట్టాలి.. కారు, హస్తం పందెంలో విజేత ఎవరు?

Rangareddy District Politics Battlefield

Updated On : November 25, 2023 / 9:32 PM IST

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అయితే.. రాజకీయాలకు రాజధాని మాత్రం హైదరాబాద్ ను రౌండ్ అప్ చేసి ఉండే రంగారెడ్డి జిల్లానే అని చెప్పాలి. పది హేను నియోజకవర్గాలు ఉన్న రంగారెడ్డి జిల్లా ఏ పార్టీకి జైకొడితే.. ఆ పార్టీయే అధికార పీఠానికి దగ్గరవుతుందనే విశ్లేషణలున్నాయి. గత ఎన్నికల్లో మూడు చోట్ల మినహాయిస్తే మిగిలిన 12 నియోజకవర్గాల్లోనూ టాప్‌గేర్‌లో దూసుకుపోయింది కారు. కాంగ్రెస్ గెలిచిన తాండూరు, మహేశ్వరం, ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యేలు కూడా ఆ తర్వాత గులాబీ కండువాలు కప్పుకోవడంతో ఉమ్మడి రంగారెడ్డి మొత్తం గులాబీమయం అయిపోయింది. ఐతే ఎన్నికల ముందు అధికార బీఆర్‌ఎస్‌ పై రివర్స్ ఎటాక్ చేసింది హస్తం పార్టీ.

బీఆర్‌ఎస్‌ నుండి గెలిచిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. అంతేకాదు గత ఎన్నికల్లో ఏనుగు గుర్తుతో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన మల్‌రెడ్డి రంగారెడ్డి.. ఈ సారి చేతి గుర్తుతో బరిలోకి దిగుతున్నారు. ఇలా ఒకరూ ఇద్దరేంటి.. మొత్తం 14 నియోజకవర్గాల్లోనూ బలమైన అభ్యర్థులను బరిలో దింపి రంగారెడ్డి రాజకీయాన్ని రసకందాయంలో పడేసింది కాంగ్రెస్ పార్టీ. అటు బీజేపీ కూడా పట్టుపెంచుకుని గ్రేటర్ లో మరోసారి ప్రతాపం చూపాలనుకుంటోంది. దీంతో రంగారెడ్డి రాజకీయం గరం.. గరంగా సాగుతోంది. మరి 14 నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలు ఎవరు? ఎవరి బలమేంటి? బలహీనతేంటి? విశ్లేషణ.. ”బ్యాటిల్ ఫీల్డ్” లో..