Assembly Elections 2023: ఎన్నికల వేళ ఈసీ కీలక నిర్ణయం.. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సహా పలువురు కలెక్టర్లు, ఎస్పీల బదిలీ

హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, వరంగల్ సీపీ రంగనాథ్, నిజామాబాద్ సీపీ సత్యనారాయణ బదిలీకి ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

Assembly Elections 2023: ఎన్నికల వేళ ఈసీ కీలక నిర్ణయం.. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సహా పలువురు కలెక్టర్లు, ఎస్పీల బదిలీ

Cv Anand

Updated On : October 11, 2023 / 8:37 PM IST

Hyderabad CP CV Anand: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ పలువురు కలెక్టర్లు, ఎస్పీలపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కూడా బదిలీ కానున్నారు. రంగారెడ్డి, మేడ్చల్‌తో పాటు యాదాద్రి, నిర్మల్ జిల్లాల కలెక్టర్లు హరీశ్, అమోయ్ కుమార్, వినయ్ కృష్ణా రెడ్డి, వరుణ్ రెడ్డిని బదిలీ చేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

అలాగే, రాష్ట్రంలోని 13 మంది ఎస్పీలు, పోలీసు కమిషనర్లను బదిలీ చేయాలని చెప్పింది. రవాణా శాఖ కార్యదర్శి, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ బదిలీ కానున్నారు. ఎక్సైజ్‌తో పాటు వాణిజ్య పన్నుల శాఖకు ప్రత్యేక సెక్రటరీలను నియమించాలని ఈసీ ఆదేశాలు ఇచ్చింది.

కాగా, ఇప్పటివరకు రవాణా శాఖ కార్యదర్శిగా శ్రీనివాసరాజు, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గా టీకే శ్రీదేవి, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ గా ముషారఫ్ అలీ ఉన్న విషయం తెలిసిందే.

మరోవైపు, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, వరంగల్ సీపీ రంగనాథ్, నిజామాబాద్ సీపీ సత్యనారాయణ బదిలీకి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. గురువారం సాయంత్రం 5 గంటల వరకు ప్యానల్ పంపాలని చెప్పింది.

YS Sharmila : షర్మిల పాలేరు నుండి ఒంటరిగానే బరిలోకి