Assembly Elections 2023: గజ్వేల్, కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్లు వేయడానికి ముహూర్తం ఖరారు.. అంతేకాదు..

అదే రోజున పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తారు. అక్టోబర్ 15, 16, 17,18 తేదీల్లో జిల్లాలు, నియోజకవర్గాల పర్యటిస్తారు. 

Assembly Elections 2023: గజ్వేల్, కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్లు వేయడానికి ముహూర్తం ఖరారు.. అంతేకాదు..

CM KCR

Updated On : October 9, 2023 / 6:47 PM IST

KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ గజ్వేల్, కామారెడ్డిలో ముఖ్యమంత్రి కేసీఆర్ నామినేషన్ వేయడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. నవంబర్ 9న రెండు నియోజక వర్గాల్లో నామినేషన్ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. కేసీఆర్ జిల్లాల్లో పర్యటించనున్నారు.

నవంబరు 9న సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి ఆనవాయితీ ప్రకారం ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. ఆ తర్వాత గజ్వేల్ లో నామినేషన్ వేస్తారు. అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు కామారెడ్డిలో నామినేషన్ వేస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభమయ్యే కామారెడ్డి బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు.

అక్టోబర్ 15న పార్టీ అభ్యర్థులతో హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో కేసీఆర్ సమావేశం ఏర్పాటు చేస్తారు. అభ్యర్థులకు భీ ఫాం అందిస్తారు. అదే రోజున పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తారు. ఎన్నికల్లో పాటించాల్సిన నియమ నిబంధనలు, తదితర అంశాలపై అభ్యర్థులకు కేసీఆర్ వివరించి, పలు సూచనలు ఇస్తారు. అక్టోబర్ 15, 16, 17,18 తేదీల్లో జిల్లాలు, నియోజకవర్గాల పర్యటిస్తారు.

అక్టోబర్ 15న హైదరాబాద్ నుంచి బయలుదేరి, హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సాయంత్రం 4 గంటలకు పాల్గొంటారు. అక్టోబర్ 16న జనగామ, భువనగిరి నియోజకవర్గాల కేంద్రాల్లో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 17న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రాల్లో పాల్గొంటారు. అక్టోబర్ 18న మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో, అదే రోజు సాయంత్రం 4 గంటలకు మేడ్చల్ నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు.

Also Read: జైల్లోనే చంద్రబాబు.. బెయిల్, కస్టడీ పిటిషన్లు డిస్మిస్ చేసిన కోర్టు