KTR : డిసెంబర్ 3 తర్వాత గుడ్ న్యూస్, కొడంగల్‌లో రేవంత్ రెడ్డి ఓటమి ఖాయం- మంత్రి కేటీఆర్
KTR On Revanth Reddy Win : డిసెంబర్ 3 తర్వాత కొన్ని పథకాలు ప్రారంభిస్తున్నాం. జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తాం. రేషన్ కార్డులు ఉన్న వారికి సన్న బియ్యం ఇస్తాం.

KTR On Revanth Reddy Win (Photo : Facebook)
తెలంగాణలో రాజకీయ పార్టీల మధ్య డైలాగ్ వార్ పీక్స్ కి చేరింది. నాయకులు మాటలతో మంటలు పుట్టిస్తున్నారు. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఎన్నికల కయ్యానికి సై అంటున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ రోడ్ షో లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. 11 ఛాన్సులు ఇచ్చాం మరి కాంగ్రెస్ ఏం చేసింది? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఆకలి కేకలు, గంజి కేంద్రాలు, ఎరువుల కోసం లాఠీఛార్జ్ లు, నక్సలైట్ల పేరు చెప్పి కాల్పులా? ఇదీ కాంగ్రెస్ పాలన అంటే ధ్వజమెత్తారు. కరెంట్ కావాలా… కాంగ్రెస్ కావాలా? కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదు. కరెంట్ ఉంటే… కాంగ్రెస్ ఉండదు అని కేటీఆర్ సెటైర్ వేశారు.
Also Read : బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ.. ఉమ్మడి నల్లగొండలో ఎగిరే జెండా ఏది?
”డిసెంబర్ 3 తర్వాత కొన్ని పథకాలు ప్రారంభిస్తున్నాం. జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తాం. రేషన్ కార్డులు ఉన్న వారికి సన్న బియ్యం ఇస్తాం. అసైన్డ్ భూములు ఉన్న వాళ్లకు హక్కులు కల్పిస్తాం. కేసీఆర్ కు తెలివి లేదు. 3 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులకు అనవసరంగా కరెంట్ ఇస్తున్నారని రేవంత్ రెడ్డి అంటున్నారు. రైతుల వద్ద 10HP మోటర్ ఉంటదా? ధరణిలో చిన్న చిన్న సమస్యలు ఉంటే ఉండొచ్చు.

KTR Election Campaign (Photo : Facebook)
కరెంట్ వస్తుందా? లేనే లేదు. ఎక్కడ వస్తుంది? అంటున్నాడు రేవంత్ రెడ్డి. మక్తల్ గడ్డ నుంచి బంపర్ ఆఫర్ ఇస్తున్నా. కాంగ్రెస్ నేతల కోసం పెడతాం. బస్సు ఎక్కి మక్తల్ లో ఎక్కడికైనా వెళ్లి కరెంట్ తీగలను గట్టిగా పట్టుకొండి. రాష్ట్రానికి ఓ దరిద్రం పోతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతుబంధు దుబారా అంటున్నాడు. కాంగ్రెస్ నేతలు ఇందిరమ్మ రాజ్యం తెస్తాం అంటున్నారు. ఆకలి కేకలు, గంజి కేంద్రాలు, ఎరువుల కోసం లాఠీఛార్జ్ లు, నక్సలైట్ల పేరు చెప్పి కాల్పులా?
Also Read : మెదక్‌లో హైఓల్టేజ్ పాలిటిక్స్.. బరిలో బడా లీడర్లు, గెలుపెవరిది?
11 ఛాన్సులు ఇచ్చాం కాంగ్రెస్ కు. సోషల్ మీడియా అస్సలు నమ్మకండి. స్వయంగా కొడంగల్ లో రేవంత్ రెడ్డి ఓడిపోతున్నాడు. కాంగ్రెస్ కు ఓటు వేసిన పాపానికి చెంపలు వేసుకుంటున్నారు. 2014లో సిలిండర్ కు మొక్కండి ఓటు వేయండి అని మోదీ అన్నారు. ఆనాడు రూ.400 సిలిండర్ ఇప్పుడు రూ.1200 అయ్యింది” అని విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్.

KTR Speech In Election Campaign (Photo : Facebook)