Traffic Restrictions: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. ఇవాళ, రేపు ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం సందర్భంగా బల్కంపేట ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Traffic Restrictions: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. ఇవాళ, రేపు ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..

Traffic Restrictions

Updated On : July 1, 2025 / 9:59 AM IST

Traffic Restrictions in Hyderabad: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవాలు సోమవారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఎల్లమ్మ అమ్మవారిని పెళ్లి కుమార్తెను చేశారు. రాత్రి 7గంటలకు వేద పండితులు గణపతి పూజ నిర్వహించారు. అనంతరం ఎదుర్కోలు కార్యక్రమంలో భారీ ఊరేగింపుతో ఘనంగా జరిగింది. ఇవాళ (మంగళవారం) ఉదయం 11.51 గంటలకు దేవస్థానం వేదపండితులు బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం క్రతువును నిర్వహించనున్నారు. అయితే, బల్కంపేట ఎల్లమ్మకల్యాణం, రథోత్సవం సందర్భంగా జులై 2 తేదీ వరకు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Also Read: Indian Railways: రైల్వే ఛార్జీలు పెరిగాయ్.. కొత్త ఛార్జీలు ఎంతంటే..? హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు ఏసీ క్లాస్‌లో పెరిగిన ఛార్జీలు ఇలా..

ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
♦ గ్రీన్‌ల్యాండ్స్, మాతా టెంపుల్, సత్యం థియేటర్ నుంచి ఫతేనగర్ వైపు వెళ్లే వాహనాలను ఎస్ఆర్ నగర్ టీ జంక్షన్ నుంచి మళ్లించి.. ఎస్ఆర్ నగర్ కమ్యూనిటీ హాల్, అభిలాష టవర్స్, బీకేగూడ క్రాస్ రోడ్డు, శ్రీరామ్ నగర్, సనత్‌నగర్ మీదుగా ఫతేనగర్ వైపు అనుమతిస్తారు.
♦ ఫతేనగర్ ఫ్లై ఓవర్ నుంచి బల్కంపేట వైపు వెళ్లే వాహనాలను కట్టమైసమ్మ టెంపుల్ వద్ద నిర్మించిన కొత్త బ్రిడ్జి నుంచి మళ్లిస్తారు.
♦ గ్రీన్‌ల్యాండ్స్ బకుల్ అపార్ట్‌మెంట్స్, ఫుడ్ వరల్డ్ నుంచి వచ్చే వాహనాలను బల్కంపేట వైపు అనుమతించరు. ఇక్కడి వాహనాలు సోనాబాయ్ టెంపుల్ నుంచి సత్యం థియేటర్ మైత్రివనం వైపుగా వెళ్లాల్సి ఉంటుంది.
♦ బేగంపేట కట్టమైసమ్మ టెంపుల్ నుంచి బల్కం‌పేట వైపు వచ్చే వాహనాలు కూడా దారి మళ్లించనున్నారు. గ్రీన్‌ల్యాండ్స్ నుంచి మాతా ఆలయం, సత్యం థియేటర్, ఎస్ఆర్ నగర్ టీ జంక్షన్ వద్ద లెఫ్ట్ తీసుకొని ఎస్ఆర్ నగర్ కమ్యూనిటీ హాల్ వైపు వెళ్లాల్సి ఉంటుంది.
♦ నేరుగా ఎస్ఆర్ నగర్ టీజంక్షన్ నుంచి ఫతేనగర్ వరకు లింక్ రోడ్లు మూసివేశారు
♦ భక్తుల కోసం ఆర్‌అండ్‌బీ, నేచర్ క్యూర్ హాస్పిటల్, జీహెచ్ఎంసీ మైదానం, పద్మశ్రీ అపార్ట్ మెంట్, ఫతేనగర్ రైల్వే వంతెన కింద పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. బల్కంపేట వైపుగా వస్తున్న ఈ వాహనదారులు తప్పకుండా ఈ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వెంటనే ట్రాఫిక్ హెల్‌లైన్ నెంబర్ 9010203626ను సంప్రదించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.