కేటీఆర్ ఆ కార్లలో ఎందుకు తిరుగుతున్నారు?: బండి సంజయ్ 

ఆ కార్లు కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన కంపెనీల పేర్లతో ఎందుకు రిజిస్టర్ అయ్యాయని ప్రశ్నించారు.

కేటీఆర్ ఆ కార్లలో ఎందుకు తిరుగుతున్నారు?: బండి సంజయ్ 

Updated On : September 22, 2025 / 10:42 AM IST

Bandi Sanjay: బీఆర్ఎస్‌ పార్టీ అక్రమంగా తెచ్చిన లగ్జరీ కార్లపై నడుస్తుందా? అంటూ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో మాజీ మంత్రి కేటీఆర్‌కి పలు ప్రశ్నలు సంధించారు.

లగ్జరీ కార్ల స్కామ్ నిందితుడు బషరత్ ఖాన్ దిగుమతి చేసిన ల్యాండ్ క్రూజర్లలో కేటీఆర్ ఎందుకు తిరుగుతున్నారని బండి సంజయ్ నిలదీశారు. ఆ కార్లు కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన కంపెనీల పేర్లతో ఎందుకు రిజిస్టర్ అయ్యాయని ప్రశ్నించారు. (Bandi Sanjay)

Also Read: గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చేసింది.. తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్‌ రైళ్లు పరుగులు.. ఎక్కడి నుంచి ఎక్కడికంటే?

మార్కెట్ ధర చెల్లించారా? లేక తక్కువగా చూపించి కొనుగోలు జరిగిందా? అని బండి సంజయ్‌ అన్నారు. పేమెంట్లు బినామీ పేర్లతో ఉన్నాయా? నకిలీ ఆదాయమా? లేక మనీలాండరింగ్ ద్వారానా? అని ప్రశ్నించారు.

ఈ స్కామ్‌లో కేసీఆర్ కుటుంబం నేరుగా ప్రయోజనం పొందినట్లు కాదా? అని బండి సంజయ్‌ అన్నారు. ఇందులో నిజాలు బయటకు రావాలని, సంబంధిత శాఖలు విచారణ జరపాలని డిమాండ్ చేశారు.