Bandi Sanjay: ఓట్ల కోసం గణేశ్ ఉత్సవాల పేరుతో దొంగ చాటుగా తాయిలాలిస్తారా?: బండి సంజయ్
ప్రజాస్వామ్యాన్ని సీఎం కేసీఆర్ ఖూనీ చేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో..

Bandi Sanjay
Bandi Sanjay – BJP: ఓట్ల కోసం గణేశ్ ఉత్సవాల పేరుతో దొంగ చాటుగా తాయిలాలిస్తారా అంటూ తెలంగాణ (Telangana) సర్కారుపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వినాయక నవరాత్రుల సందర్భంగా కరీంనగర్ నగరంలోని చైతన్యపురి, భాగ్యనగర్, మంకమ్మతోట, జ్యోతినగర్, రాంనగర్ లో గణనాథుల విగ్రహాలను ఆయన సందర్శించారు.
అనంతరం బండి సంజయ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్యాన్ని సీఎం కేసీఆర్ ఖూనీ చేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ స్కీంలు, స్కాంలతో దోచుకుంటున్నారని, అంతే తప్ప ఆయన చేసింది ఏమీ లేదన్నారు. కనీసం పోటీ పరీక్షలను సమర్థంగా నిర్వహించడం కూడా కేసీఆర్ కు చేతగావడం లేదని విమర్శించారు. పదేళ్లలో ఒక్క గ్రూప్ 1 పోస్టును కూడా భర్తీ చేయలేదని అన్నారు.
నిరుద్యోగుల జీవితాలతో కేసీఆర్ చెలగాటమాడుతున్నారని చెప్పారు. పరీక్ష నష్టపోయిన ఒక్కో నిరుద్యోగికి రూ.లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ మేరకు ఒక్కో నిరుద్యోగికి నిరుద్యోగ భృతి కూడా అందించాలన్నారు. టీఎస్పీఎస్సీ బోర్డును ఇంకెప్పుడు ప్రక్షాళన చేస్తారని నిలదీశారు. పాలమూరులో జరిగే బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలిరావాలని కోరారు.
Chandrababu Bail : చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై రేపే విచారణ.. తీర్పుపై సర్వత్రా తీవ్ర ఉత్కంఠ