మల్కాజ్‌గిరి పార్లమెంట్ కాంగ్రెస్ టికెట్ కోసం బండ్ల గణేశ్ దరఖాస్తు

సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్.. మల్కాజ్‌గిరి పార్లమెంట్ టిక్కెట్ కోసం దరఖాస్తు చేయడం ఆసక్తికరంగా మారింది.

మల్కాజ్‌గిరి పార్లమెంట్ కాంగ్రెస్ టికెట్ కోసం బండ్ల గణేశ్ దరఖాస్తు

bandla ganesh applied for malkajgiri congress ticket

Updated On : February 2, 2024 / 12:21 PM IST

Bandla Ganesh: పార్లమెంట్‌ బరిలో నిలిచే అభ్యర్థుల కోసం కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు స్వీకరిస్తోంది. దీని కోసం హైదరాబాద్‌లోని గాంధీ భవన్ లో ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేశారు. ఆశావహులు భారీగా దరఖాస్తులు సమర్సిస్తున్నారు. ఫిబ్రవరి 3 వరకు నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. కాగా, మల్కాజ్‌గిరి లోక్‌స‌భ‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పెద్ద సంఖ్యలో ఆశావహులు దరఖాస్తులు సమర్పించినట్టు తెలుస్తోంది. తాజాగా మల్కాజ్‌గిరి పార్లమెంట్ టికెట్ కోసం సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కూడా దరఖాస్తు చేశారు.

రేవంత్ రెడ్డి పరిపాలన అద్బుతం
ఈ సందర్భంగా బండ్ల గణేశ్ మాట్లాడుతూ.. ఇంద్రవెళ్లి సభకోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఈ రెండు నెలల రేవంత్ రెడ్డి పరిపాలన అద్బుతంగా ఉందని అన్నారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ సీట్లు గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మతిభ్రమించి ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మల్లారెడ్డి విద్యార్థుల రక్తాన్ని పీల్చి పీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

మల్లారెడ్డిని తీసుకోం
”రేవంత్ రెడ్డి పరిపాలన చూసి కాంగ్రెస్ కార్యకర్తగా నేను గర్వపడుతున్నా. మల్లారెడ్డిని మా పార్టీలోకి వచ్చినా తీసుకోబోమ”ని బండ్ల గణేశ్ అన్నారు. కాగా, మల్కాజ్‌గిరి పార్లమెంట్ టిక్కెట్ కోసం ఆయన దరఖాస్తు చేయడం ఆసక్తికరంగా మారింది. మినీ ఇండియా పేరొందిన మల్కాజ్‌గిరి టికెట్ కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి ఇస్తుందనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

Also Read: కాంగ్రెస్ హామీల అమలుపై కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. తొందరపడొద్దంటూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం

ఇప్పటివరకు 45 దరఖాస్తులు
ఇప్పటివరకు మొత్తం 45 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. ఖమ్మం లోక్ సభ టికెట్ కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి దరఖాస్తు చేశారు. ఇప్పటికే ఖమ్మం సీటు కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని, సీనియర్ నేత వి హనుమంతరావు దరఖాస్తు చేసుకున్నారు. మహబూబ్ నగర్ ఎంపీ సీటు కోసం సీత దయాకర్ రెడ్డి దరఖాస్తు చేశారు.