Amazing Hospitality : వామ్మో.. 365 రకాల వంటకాలతో విందుభోజనం.. కొత్త అల్లుళ్లకు అత్తింటి వారి అదిరిపోయే ఆతిధ్యం..
సంక్రాంతికి తొలిసారి అల్లుడు రావడంతో ఆయనకు తెలియకుండా సర్ ప్రైజ్ చేసేందుకు పిండి వంటలతో పాటు..

Amazing Hospitality : సంక్రాంతి వచ్చిందంటే చాలు ఏపీలో కొత్త అల్లుళ్లకు పిండి వంటలు, స్వీట్లు లాంటి వివిధ వంటకాలతో సర్ ప్రైజ్ ఇస్తారు. కానీ, ఆంధ్రా నుంచి హైదరాబాద్ వచ్చిన అల్లుడికి అత్తమామలు అబ్బురపరిచే వంటకాలను రుచి చూపారు. పెళ్లైన తర్వాత తొలిసారి వచ్చిన అల్లుడికి అత్తమామలు 130 రకాల వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారు.
కాకినాడకు చెందిన తమ అల్లుడికి తెలంగాణ వంటకాలు రుచి చూపించి ఆనందపరిచారు. సరూర్ నగర్ సమీపంలోని శారదానగర్ లో నివాసం ఉంటున్న క్రాంతి, కల్పన దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. పెద్ద కుమార్తెను కాకినాడకు చెందిన మల్లికార్జున్ తో నాలుగు నెలల క్రితం వివాహం జరిపించారు. సంక్రాంతికి తొలిసారి అల్లుడు రావడంతో ఆయనకు తెలియకుండా సర్ ప్రైజ్ చేసేందుకు పిండి వంటలతో పాటు మాంసాహారం, శాఖాహారం, పులిహోర, బగారా లాంటి 130 రకాల వంటలు వండించారు.
Also Read : నారావారిపల్లె సంక్రాంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు.. ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలు ఆవిష్కరణ
365 రకాల వంటలతో కొత్త అల్లుళ్లకు అత్తమామల ఆతిథ్యం..
ఇక, గోదావరి జిల్లాలంటేనే ఆతిధ్యానికి పెట్టింది పేరు. సంక్రాంతి పండక్కి కొత్త అల్లుళ్లు వస్తే ఆ సందడే వేరు. పండగ సందర్భంగా తూర్పు గోదావరి జల్లా నందమూరి గురు గ్రామంలో కొత్త అల్లుళ్లకు పసందైన విందు ఇచ్చారు మామ ఆకుల పీర్లస్వామి. 365 రకాల వంటంలో అతిథి మర్యాద చేశారు. అత్తింటి అతిధి మర్యాదలతో కొత్త అల్లుళ్లు తెగ ఆనందపడ్డారు.
భీమవరంలో సంక్రాంతి స్సెషల్ వంటకాలు..
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సంక్రాంతి స్పెషల్ వంటకాలు సిద్ధం చేశారు అక్కడి మహిళలు. సంక్రాంతి పండగ అంటేనే అందరూ కలిసి సంతోషంగా జరుపుకునే పండగ కావడంతో ఒక్కో ఇంట్లో ఒక్కో రకం పిండి వంటకం చేసి అందరూ కలిసి ఆ వంటకాలను షేర్ చేసుకుంటున్నారు. పండగ స్పెషల్ ఎలా ఉంటుందో తెలుపుతూ.. అనురాగం, ఆప్యాయతలు అంటే ఏమిటో నేటి తరానికి తెలియజేస్తూ అందరికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
Also Read : మహా కుంభమేళా.. పవిత్ర త్రివేణి సంగమంలో నాగసాధువులు ‘అమృత స్నానం’.. పోటెత్తిన భక్తజనం