Accident: ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రి నిర్లక్ష్యానికి ఇద్దరు పిల్లలు బలి
ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం చెందగా.. తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. నిర్లక్ష్యం, పరధ్యానం వల్లే ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ట్రాఫిక్ రూల్స్ పై సరైన అవగాహన లేకపోవడం కూడా ఈ తరహా ప్రమాదాలకు కారణం

Bus and Bike: ఒక తండ్రి నిర్లక్ష్యానికి ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. కాగా, తల్లిదండ్రులు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ములుగు జిల్లాలోని మంగపేట గ్రామంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం మిగిల్చిన విషాదం ఇది. కుటుంబంతో (భార్య, ఇద్దరు పిల్లలు) కలిసి బైక్ మీద వెళ్తుండగా టర్నింగ్ వద్ద ఆర్టీసీ బస్సును ఢీకొన్నారు. దీంతో ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తల్లిదండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయమై తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ స్పందిస్తూ ట్రాఫిక్ రూల్స్ మీద అవగాహన లేకపోడం, నిర్లక్ష్యం, పరధ్యానం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.
ఈ బైకర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఖరీదు రెండు నిండు ప్రాణాలు. ఇద్దరు కుమారులు, భార్యను ఎక్కించుకుని అజాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ బైక్ ను #TSRTC బస్సుకు ఢీకొట్టాడు. ములుగు జిల్లా మంగపేటలోని తెలంగాణ సెంటర్ వద్ద శుక్రవారం ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం… pic.twitter.com/5zv1y04a6X
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) June 17, 2023
ప్రమాదానికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన సజ్జనార్.. ‘‘ఈ బైకర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఖరీదు రెండు నిండు ప్రాణాలు. ఇద్దరు కుమారులు, భార్యను ఎక్కించుకుని అజాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ బైక్ ను #TSRTC బస్సుకు ఢీకొట్టాడు. ములుగు జిల్లా మంగపేటలోని తెలంగాణ సెంటర్ వద్ద శుక్రవారం ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం చెందగా.. తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. నిర్లక్ష్యం, పరధ్యానం వల్లే ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ట్రాఫిక్ రూల్స్ పై సరైన అవగాహన లేకపోవడం కూడా ఈ తరహా ప్రమాదాలకు కారణం. రహదారులపై వాహనాలు నడిపేటప్పుడు నిత్యం జాగ్రత్తగా ఉండాలి. ట్రాఫిక్ రూల్స్‌ను విధిగా పాటించాలి. ఇలా అజాగ్రత్తగా వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి’’ అని ట్వీట్ చేశారు.