రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో తేనె తుట్టెను కదిపారు.. జరగబోయేది ఇదే..: బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి

రేవంత్ రెడ్డికి పాతబస్తీ చెరువుల కబ్జాలు తొలగించే దమ్ము ఉందా అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిలదీశారు.

రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో తేనె తుట్టెను కదిపారు.. జరగబోయేది ఇదే..: బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి

Alleti Maheshwar Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో తేనె తుట్టెను కదిపారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్‌లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో చిట్ చాట్‌లో పాల్గొని హైడ్రాపై స్పందించారు. రేవంత్ రెడ్డికి దూకుడు ఎక్కవని, అదే ఆయనకు ఇబ్బందిగా మారుతుందని చెప్పారు.

రేవంత్ రెడ్డికి పాతబస్తీ చెరువుల కబ్జాలు తొలగించే దమ్ము ఉందా అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిలదీశారు. ఒవైసీ కాలేజీ చెరువు కబ్జా చేసి కట్టిందేనని, మరి దానిని కూల్చేస్తారా అని ప్రశ్నించారు. హైడ్రామా మొదలు పెట్టింది రాష్ట్రంలోని ఇతర అంశాలను పక్క దారి పట్టించేందుకేనని చెప్పారు. రాష్ట్రంలో రుణమాఫీ జరగక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు.

దీనిపై మంత్రులు ఒకలా మాట్లాడుతుంటే, రేవంత్ రెడ్డి మరోలా మాట్లాడుతారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి రూ.31 వేల కోట్లు రుణమాఫీ చేశామని అంటున్నారని, మంత్రులు మాత్రం రూ.17 వేల కోట్లు అని అంటున్నారని తెలిపారు. తెలంగాణ మంత్రి వర్గంలో ఓ ఫేక్ మంత్రి ఉన్నారని,. ఆయన ఫేక్ డాకుమెంట్స్ పెట్టారని ఆరోపించారు.

Also Read: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆయన జన్మస్థలం జైళ్లను బాగుచేయాలి.. ‘హైడ్రా’ వల్ల వీళ్లు జైలుకి వెళ్తారు: సీపీఐ నారాయణ