Revanth Reddy : కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర : రేవంత్ రెడ్డి

బీజేపీ.. కాంగ్రెస్ ను నిందిస్తుందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ది ఫెవికాల్ బంధమని, మరి ఎంఐఎం ఎందుకు కాంగ్రెస్ ను దూషిస్తోందని ప్రశ్నించారు.

Revanth Reddy : కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర : రేవంత్ రెడ్డి

Revanth Reddy

Updated On : October 7, 2023 / 8:30 PM IST

Revanth Reddy – BJP – BRS : పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేయాలి కానీ, ప్రభుత్వాన్ని చూసి ప్రజలు భయపడే పరిస్థితి దేశంలో దాపురించిందన్నారు. మైనారిటీలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని తెలిపారు. క్రిస్టియన్ మైనారిటీల కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. మీ డిమాండ్లను అమలు చేయాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. రాష్ట్రంలో హాంగ్ వస్తుందని, బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతుందని బీఎల్ సంతోష్ చెబుతున్నారని పేర్కొన్నారు.

కాంగ్రెస్, బీజేపీ కలవవు అని అందరికీ తెలుసన్నారు. హంగ్ వస్తే కలవబోయేది బీజేపీ, బీఆర్ఎస్ అని అని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. కర్ణాటకలో మైనారిటీలు కాంగ్రెస్ వైపు నిలబడ్డారని అందుకే అక్కడ మైనారిటీల సంక్షేమం కోరే ప్రభుత్వం ఏర్పడిందన్నారు.

Shabbir Ali : కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ కాంగ్రెస్ : షబ్బీర్ అలీ

తెలంగాణలోనూ మైనారిటీలు కాంగ్రెస్ కు అండగా నిలవాలని కోరారు. కేసీఆర్, కేటీఆర్ సోనియాను దూషిస్తున్నారని తెలిపారు. బీజేపీ.. కాంగ్రెస్ ను నిందిస్తుందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ది ఫెవికాల్ బంధమని, మరి ఎంఐఎం ఎందుకు కాంగ్రెస్ ను దూషిస్తోందని ప్రశ్నించారు. పదవులు త్యాగం చేసినందుకా? దళితుడిని జాతీయ అధ్యక్షుడిని చేసినందుకా? అని నిలదీశారు.

కొప్పుల ఈశ్వర్ ప్రెస్ మీట్ లో కూర్చుంటేనే కేసీఆర్ సహించలేదన్నారు. తెలంగాణలో జరిగే ఎన్నికలు దేశ రాజకీయాలను మలుపుతిప్పుతాయన్నారు. డిసెంబర్ మిరాకిల్ నెల అని అన్నారు. 2009 డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన వచ్చింది… 2023 డిసెంబర్ లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Harish Rao: ఈయన లోకల్ వ్యక్తి.. బీదవాడు, అందరివాడు: మంత్రి హరీశ్ రావు

కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే బడుగులు బలహీన వర్గాలు, మైనారిటీలకు మేలు అని అన్నారు. కేసీఆర్, మోదీ అపూర్వ సోదరులు అని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆ ఇద్దరికీ బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. సోనియా గాంధీని విమర్శించే నాయకులు ఒల్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.