Kishan Reddy: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి.. మరి బండి సంజయ్ ఎక్కడికి?

తెలంగాణతో పాటు మరో 7 రాష్ట్రాల అధ్యక్షుల్ని మారుస్తూ మంగళవారం నూతన అధ్యక్షుల జాబితాను విడుదల చేసింది. కొద్ది రోజులుగా దీనిపై పార్టీ వర్గాల్లో రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.

Kishan Reddy: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి.. మరి బండి సంజయ్ ఎక్కడికి?

Updated On : July 4, 2023 / 4:17 PM IST

Telangana BJP Chief: తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించింది అధిష్టానం. తెలంగాణతో పాటు మరో 7 రాష్ట్రాల అధ్యక్షుల్ని మారుస్తూ మంగళవారం నూతన అధ్యక్షుల జాబితాను విడుదల చేసింది. కొద్ది రోజులుగా దీనిపై పార్టీ వర్గాల్లో రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా పురంధేశ్వరిని నియమించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కర్ణాటక, గుజరాత్, పంజాబ్, ఒడిశా, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల అధ్యక్షులు ఈ మార్పులో ఉన్నారు. జార్ఖండ్ అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే బాబూలాల్ మారండి, పంజాబ్ అధ్యక్షుడిగా సునిల్ జాఖర్‭లను నియమించారు.

Delhi NEET Racket : ఢిల్లీ ఎయిమ్స్‌ విద్యార్ధుల ఘరానా మోసం,నీట్‌ పరీక్ష రాస్తామంటూ ఒక్కో అభ్యర్థి నుంచి రూ.7 లక్షలు వసూలు

2020 మార్చి 11న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడుగా బండి సంజయ్ నియామకం అయ్యారు. మూడేళ్ల అనంతరం రాష్ట్ర అధ్యక్షుడిని మార్చారు. అయితే బండి సంజయ్ కి కేంద్ర మంత్రి వర్గంలో అవకాశం ఇవ్వనున్నట్లు ఇప్పటికే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఆయనకు నిజంగానే కేంద్ర మంత్రి పదవి ఇస్తారా అనేది చూడాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా నియమిస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు.

Shahrukh Khan : షూటింగ్‌లో షారుఖ్‌కి ప్రమాదం.. అమెరికాలో సర్జరీ.. ఆందోళనలో అభిమానులు..

కాగా, తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవికి బండి సంజయ్ తన రాజీనామాను ప్రకటించారు. తనకు అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధినేత జేపీ నడ్డా సహా ఇతర ముఖ్యనేతలకు ధన్యవాదాలు తెలిపారు.