Delhi NEET Racket : ఢిల్లీ ఎయిమ్స్‌ విద్యార్ధుల ఘరానా మోసం,నీట్‌ పరీక్ష రాస్తామంటూ ఒక్కో అభ్యర్థి నుంచి రూ.7 లక్షలు వసూలు

ఢిల్లీ వేదికగా నీట్ పరీక్ష రాకెట్ గుట్టు రట్టు చేశారు పోలీసులు. నలుగురు ఎయిమ్స్ విద్యార్ధులను అరెస్ట్ చేశారు. నకిలీ అభ్యర్థులుగా నీట్ పరీక్ష రాస్తు అడ్డంగా దొరికిపోయారు.

Delhi NEET Racket : ఢిల్లీ ఎయిమ్స్‌ విద్యార్ధుల ఘరానా మోసం,నీట్‌ పరీక్ష రాస్తామంటూ ఒక్కో అభ్యర్థి నుంచి రూ.7 లక్షలు వసూలు

Delhi NEET Racket..AIIMS Students

Updated On : July 4, 2023 / 3:47 PM IST

Delhi NEET Racket..AIIMS Students : దందాలు ఎక్కడ చూసినా దందాలు..ఆఖరికి పరీక్షలు రాయటంలో కూడా ఇదే నడుస్తోంది. మోసం చేయటానికి కాదు ఏదీ అనర్హం అన్నట్లుగా పరీక్షలు రాయటంలో కూడా మోసాలు జరుగుతున్నాయి. ఈ దందాలోకి నీట్ పరీక్ష కూడా చేరిపోయింది. వైద్య కళాశాల(Medical College)ల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ పరీక్ష (National Eligibility-cum-Entrance Test)లో ఘరానా మోసాలకు పాల్పడినట్లుగా గుర్తించారు పోలీసులు. ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ మోసాన్ని బట్టబయలు చేశారు పోలీసులు. రూ.7లక్షలు ఇస్తే నీట్ పరీక్ష రాస్తాం అంటూ ఢిల్లీ ఎయిమ్స్ All India Institute of Medical Sciences (AIIMS)విద్యార్ధులు చేసే ఘరానా మోసం (NEET racket)బయటపడింది.

నీట్ ఎగ్జామ్ (NEET Exam) రాయిస్తాం అంటూ ఒక్కో అభ్యర్థి నుంచి రూ.7లక్షలు వసూళ్లు చేసి వారి స్థానంలో నకిలీ అభ్యర్ధులతో పరీక్ష రాస్తోంది ఓ ముఠా. ఢిల్లీలోని ఎయిమ్స్ సెకండ్ ఇయర్ చదువుతున్న నరేశ్ బిష్రోయ్ (Naresh Bishroi)ఈ ముఠాకు నాయకత్వం వహిస్తున్నట్లుగా ఢిల్లీ పోలీసులు (Delhi Police) గుర్తించారు.దేశ రాజధాని ఢిల్లీ వేదికగా నడుతున్న ‘నీట్‌ రాకెట్‌’ (NEET racket)ను ఢిల్లీ పోలీసులు ఛేదించారు. ఈ ముఠా నాయకుడు నరేష్ బిష్రోయ్ తో సహా నలుగురు విద్యార్థులను అరెస్టు చేశారు.

Mumbai : పోగొట్టుకున్న ఐ ఫోన్ తిరిగి ఆ మహిళ చేతికి ఎలా వచ్చిందంటే?

నీట్‌ పరీక్షలో అభ్యర్థుల స్థానంలో నకిలీ వ్యక్తులను ఏర్పాటు చేయించి వారితో నరేశ్ పరీక్ష (NEET Exam) రాయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఏ మోసానికైనా డబ్బులే ప్రధానంగా ఉంటాయి. అదే డబ్బు ఆశ పెట్టి కొంతమందిని నరేశ్ ఆకట్టుకున్నాడు. అలా కొంతమందిని తన గ్యాంగ్ లో చేర్చుకున్నాడు దీంట్లో భాగంగా ఎయిమ్స్‌లో ఫస్ట్ ఇయర్ చదివే విద్యార్ధులతో నీట్ పరీక్ష రాయించేవాడు. దీని కోసం వారితో స్నేహం చేసిన నెమ్మదిగా వారికి డబ్బు ఆశపెట్టి రంగంలోకి దింపుతాడు. తాను కూడా అలాగే వేరే అభ్యర్థి స్థానంలో పరీక్ష రాస్తుంటాడు. అలా తను రెండో సంవత్సరం పరీక్ష రాస్తు దొరికిపోయాడు.

దీంట్లో భాగంగానే ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన నీట్‌ ప్రవేశ పరీక్షలో నరేశ్ గ్యాంగ్‌కు చెందిన కొంతమంది అభ్యర్థుల స్థానంలో పరీక్ష రాస్తూ అడ్డంగా బుక్ అయ్యారు. అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఎయిమ్స్‌లో రేడియాలజీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న(first year radiology student  In AIIMS) సంజూ యాదవ్ (Sanju Yadav)అనే విద్యార్ధి వేరే (డీల్ కుదుర్చుకున్న అభ్యర్థి) స్థానంలో పరీక్ష రాస్తు అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. ఢిల్లీలోనే కాకుండా మహారాష్ట్ర(Maharashtra)లోని నాగ్‌పుర్‌(Nagpur)లో ఓ నీట్‌ పరీక్షా కేంద్రం (NEET Exam ceter)లో మరో ఇద్దరు విద్యార్థులు మహవీర్‌(Mahaveer), జితేంద్ర ( Jitendra)అనే ఇద్దరు విద్యార్ధులు పట్టుబడ్డారు. వీరిద్దరు కూడా ఢిల్లీ ఎయిమ్స్ విద్యార్ధులే(AIIMS Students).

వారిని విచారించగా కీలక విషయాలు బయటపడ్డాయి. నకిలీ విద్యార్థులతో పరీక్ష రాయించేందుకు నీట్ పరీక్ష రాయించటానికి ఒక్కో అభ్యర్థి నుంచి నరేశ్ రూ.7లక్షలకు డీల్ మాట్లాడుకుంటాడు. దాని కోసం ముందుగా లక్ష రూపాయలు అడ్వాన్స్ గా తీసుకుంటాడు. పరీక్ష రాసిన తరువాత మిగిలిన ఆరు లక్షల రూపాయలు తీసుకుంటాడు. అలా పరీక్ష రాసిన అభ్యర్థికి (ఫేక్ అభ్యర్థి)కి కొంత ఇస్తాడు. ఇలా మోసం ఎల్లకాలం సాగదన్నట్లుగా ఈ ఫేక్ అభ్యర్థులు (Fake candidates)అడ్డంగా దొరికిపోయారు. వీరిని విచారించగా పలు అంశాలు వెలుగులోకి రావటమే కాకుండా ఇంకా ఈ ముఠాతో ఎవరెవరికి లింకులు ఉన్నాయో దర్యాప్తు ముమ్మరం చేశారు ఢిల్లీ పోలీసులు. నిందితుల నుంచి ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్లు..కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు.

కాగా..నీట్ పరీక్ష రాసే విద్యార్ధుల విషయంలో ఎన్నో కఠిన నిబంధనలు పెట్టి..అభ్యర్థులను ఎంత క్షుణ్ణంగా చెక్కింగ్ చేసినా ఇటువంటి మోసాలు జరుగటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.
పరీక్ష రాసే అభ్యర్థులు షూస్ కాకుండా శాండిల్స్ మాత్రమే ధరించాలి. వాచ్ లు, వాలెంట్లు నాట్ ఎలవ్డ్. ఫుల్ హ్యాండ్స్ షర్టులు ధరించరాదు. శరీరంపై ఆభరణాలు కూడా ఉండకూడదు. ఇలా ఎన్నో నిబంధనల మధ్య ఆంక్షల మధ్య పరీక్ష జరుగుతుంది. అయినా ఇటువంటి ఘరానా మోసాలు జరగటం ఆందోళన కలిగిస్తోంది. నిజమైన ప్రతిభకు అన్యాయం జరుగుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.