Ram Temple : తెలంగాణ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లలో భక్తులు.. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసం బీజేపీ ప్లాన్!

అయోధ్య రామమందిరం విగ్రహప్రతిష్టాపన కార్యక్రమం కోసం ఎంతోమంది ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ వేడుకను కళ్లారా చూడాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ వేడుకను నభూతో నభవిష్యతి అనేలా ఏర్పాట్లు చేస్తోంది రామ జన్మబూమి ట్రస్ట్.

Ram Temple : తెలంగాణ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లలో భక్తులు.. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసం బీజేపీ ప్లాన్!

Updated On : January 8, 2024 / 12:24 PM IST

Ram Temple..Ayodhya from Telangana trains : శ్రీరామ జన్మభూమి అయోధ్య రామమందిరం విగ్రహప్రతిష్టాపన కార్యక్రమం కోసం ఎంతోమంది ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ వేడుకను కళ్లారా చూడాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ వేడుకను నభూతో నభవిష్యతి అనేలా ఏర్పాట్లు చేస్తోంది రామ జన్మభూమి ట్రస్ట్. రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు జనవరి 16వ తేదీ నుంచి ప్రారంభంకానున్న ఈ కార్యక్రమానికి  బౌద్ధుల మత గురువు దలైలామా నుంచి పారిశ్రామికవేత్త అదానీ దాకా పలువురు ప్రముఖులను ఆహ్వానించారు ట్రస్ట్ నిర్వాహకులు.

ఇదిలా ఉంటే.. తెలంగాణ నుంచి అయోధ్యకు వెళ్లేవారి కోసం బీజేపీ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసే ప్లాన్‌లో ఉంది. రానున్న పార్లమెంట్  ఎన్నికల్లో లబ్ది పొందేలా రామమందిరం సెంటిమెంట్‌ను ఉపయోగించుకునేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది. దీంట్లో భాగంగా తెలంగాణ నుంచి అయోధ్యకు 17 రైళ్లు ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తోంది తెలంగాణ బీజేపీ. దీని కోసం బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి రెండు కమిటీలను కూడా వేయనున్నారు.

దలైలామా నుంచి అదానీ దాకా… రామాలయ విగ్రహ ప్రతిష్ఠాపనకు రామ్ జన్మభూమి ట్రస్ట్ ఆహ్వానం

తెలంగాణలోని ప్రతీ పార్లమెంట్ నియోజక వర్గం నుంచి ఒక్కో ట్రైన్ పంపించేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 1000 నుంచి 2000మంది అయోధ్యకు వెళ్లే అవకాశాన్ని కల్పించేలా కమలనాధులు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. రామ మందిర ప్రారంభానికి ముందే అయోధ్యకు వెళ్లి వచ్చేలా కార్యాచరణ రూపొందిస్తోంది కమలం పార్టీ.

వరుసగా 17 రోజులు పాటు 17 నియోజకవర్గల నుంచి అయోధ్యకు రైళ్ళు నడిచే ఏర్పాట్లు చేయనుంది. అయోధ్య రామ మందిర నిర్మాణం, విగ్రహప్రతిష్టాపన సెంటిమెంట్ వచ్చే పార్లమెంటు ఎన్నికల ముందు తమకు కలసొస్తుందని బీజేపీ ఆశిస్తోంది. ఈ కార్యక్రమం కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రత్యేకంగా రెండు కమిటీలు వేయనున్నారు. ఒక కమిటీ తెలంగాణలో ఆర్గనైజ్ చేయనుంది. మరో కమిటీ ఇక్కడి నుండి వెళ్లిన వారికి అయోధ్యలో ఏర్పాట్లు చేయనుంది.