DK Aruna: మీ మధ్య వైరాన్ని వారిపై చూపొద్దు.. అల్లు అర్జున్ ఇంటిపై దాడిని ఖండించిన డీకే అరుణ

అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘటనను పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. తాజాగా బీజేపీ ఎంపీ డీకే అరుణ స్పందించారు.

DK Aruna: మీ మధ్య వైరాన్ని వారిపై చూపొద్దు.. అల్లు అర్జున్ ఇంటిపై దాడిని ఖండించిన డీకే అరుణ

DK Aruna

Updated On : December 23, 2024 / 8:41 AM IST

Allu Arjun: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం సాయంత్రం అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ నాయకులు రాళ్ల దాడికి దిగిన విషయం తెలిసిందే. అర్జున్ ఇంట్లోకి ఓయూ జేఏసీ నాయకులు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వారిని భద్రతా సిబ్బంది అడ్డుకోవటంతో పూల కుండీలను ధ్వంసం చేశారు. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిలో కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన అనంతరం అల్లు అర్జున్ ఇంటి బయట పోలీసుల భద్రతను పెంచారు.

Also Read: Vijayashanti: సంధ్య థియేటర్ ఘటనపై స్పందించిన విజయశాంతి.. వారిపై తీవ్ర ఆగ్రహం ..

అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘటనను పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. తాజాగా బీజేపీ ఎంపీ డీకే అరుణ స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ అల్లు అర్జున్ ఇంటిపై దాడిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇది ఎవరూ సహించరానిది. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు గాడి తప్పాయి. పోలీసు ఉన్నతాధికారులు ఇలాంటి ఘటనలపై కఠినంగా వ్యవహరించాలి. ఈ దాడి వెనుక కాంగ్రెస్ కుట్ర ఉన్నట్లు అనుమానం కలుగుతోంది. మీకు (రేవంత్ రెడ్డి), కేటీఆర్ కు ఉన్న వైరాన్ని సినిమా వాళ్లపై చూపడం సరైంది కాదు. రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేయడం సరికాదు.’’ అంటూ డీకే అరుణ పేర్కొన్నారు.