JP Nadda: నేటి మధ్యాహ్నం కరీంనగర్ రానున్న బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను నేటితో ముగించనున్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఈ సభలో పాల్గొనేందుకు వస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2.50 గంటలకు జేపీ నడ్డా హైదరాబాద్, శంషాబాద్ విమానాశ్రయం నుంచి కరీంనగర్ కు హెలికాప్టర్‌లో బయలుదేరి, కరీంనగర్ కు మధ్యాహ్నం 3.30 గంటలకు చేరుకుంటారు. అక్కడి స్పోర్ట్స్ స్కూల్ ఆవరణలో హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. పాదయాత్ర ముగింపు సభా ప్రాంగణంలో దాదాపు గంటసేపు జేపీ నడ్డా ఉంటారు. బీజేపీ విధానాలు, టీఆర్ఎస్ తీరుపై ప్రసంగిస్తారు.

BJP apologises to Kohima Baptist Church for inaccurate reports about JP Nadda visit
JP Nadda: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను నేటితో ముగించనున్నారు. నిన్న కరీంనగర్ జిల్లాలోని మంగపేట, కురిక్యాల, కొత్తపల్లి మీదుగా పాదయాత్ర చేశారు. బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభ నేడు కరీంనగర్, ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్ లో జరగనుంది. అందుకు బీజేపీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. గత రాత్రి రేకుర్తి చేరుకున్న బండి సంజయ్ ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు పాదయాత్రగానే ముగింపు సభ ప్రాంగణానికి వస్తారు.
బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఈ సభలో పాల్గొనేందుకు వస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2.50 గంటలకు జేపీ నడ్డా హైదరాబాద్, శంషాబాద్ విమానాశ్రయం నుంచి కరీంనగర్ కు హెలికాప్టర్‌లో బయలుదేరి, కరీంనగర్ కు మధ్యాహ్నం 3.30 గంటలకు చేరుకుంటారు. అక్కడి స్పోర్ట్స్ స్కూల్ ఆవరణలో హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. పాదయాత్ర ముగింపు సభా ప్రాంగణంలో దాదాపు గంటసేపు జేపీ నడ్డా ఉంటారు. బీజేపీ విధానాలు, టీఆర్ఎస్ తీరుపై ప్రసంగిస్తారు. అనంతరం తిరిగి హెలికాప్టర్ లో వెళ్తారు.
దీంతో ఆ పార్టీ నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. సభకు వేలాది మంది ప్రజలు వచ్చే అవకాశం ఉండడంతో అందుకు తగ్గ ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలీసులు ఆ ప్రాంతంలో భద్రతా చర్యలు చేపట్టారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీకి మరింత బలాన్ని చేకూర్చేందుకు బండి సంజయ్ ఇప్పటికే నాలుగు విడతల ప్రజాసంగ్రామ యాత్రను ముగించారు. ప్రస్తుతం కొనసాగిస్తున్న యాత్ర 5వ దశ పాదయాత్ర.
FIFA World Cup 2022: మొరాకోపై ఫ్రాన్స్ విజయం… వరుసగా రెండోసారి ఫైనల్‌కు..