Bandi Sanjay: మేం సింగిల్‌గానే పోటీచేస్తాం.. ధరణి మంచి స్కీం.. కానీ, కేసీఆర్ కుటుంబంకోసం వాడుకుంటున్నారు

బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఒక్కటి కాదు. బీఅర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీని ప్రజలు ఆదరిస్తున్నారని సంజయ్ చెప్పారు.

Bandi Sanjay: మేం సింగిల్‌గానే పోటీచేస్తాం.. ధరణి మంచి స్కీం.. కానీ, కేసీఆర్ కుటుంబంకోసం వాడుకుంటున్నారు

Bandi Sanjay

Updated On : June 22, 2023 / 11:31 AM IST

TS BJP President: తెలంగాణ (Telangana) లో వచ్చే ఎన్నికల్లో సింగిల్‌గానే పోటీ చేస్తామని ఎంపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) పాలన‌లో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకు వెళ్తున్నామని చెప్పారు. 119 నియోజక వర్గాల్లో ఒక్కొక్క బహిరంగ సభలు నిర్వహిస్తున్నామని, అన్ని‌పోలింగ్ బూత్‌ల పరిధిలో ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని చెప్పారు. రెండు గంటల్లో 10 లక్షల కుటుంబాలను కలిశామని, గురువారం ఒక్కరోజే 30లక్షల కుటుంబాలను కలుసుకుంటామని అన్నారు. ప్రపంచమంతా మోడీని కీర్తిస్తుందని, ఇతర దేశాల ప్రధానులు మోడీ ది బాస్ అంటున్నారని సంజయ్ పేర్కొన్నారు. ఒకరోజు తెలంగాణ వ్యాప్తంగా డ్రైవర్స్‌ని కలుస్తామని చెప్పారు.

Intintiki BJP : ఒక్కరోజే 35లక్షల కుటుంబాలతో మమేకం.. ఇంటింటికీ బీజేపీ పేరుతో భారీ కార్యక్రమానికి శ్రీకారం

తెలంగాణ అభివృద్ధి‌కి కేంద్రం నిధులు ఇచ్చిసహకరించిందని సంజయ్ చెప్పారు. 14వందల అమరవీరులను స్మరించుకునే స్థితిలో ముఖ్యమంత్రి లేడని విమర్శించారు. కేంద్రం 2లక్షల ఇళ్ళు ఇస్తే.. నువ్వు 15వేల ఇళ్లు ఇస్తున్నావ్. నాణ్యత లేకుండా ఇళ్ళు కడుతున్నావ్ అంటూ సీఎం కేసీఆర్ ను ఉద్దేశిస్తూ సంజయ్ విమర్శలు చేశారు. నాతోవస్తే మోడీ వద్దకు వెళ్లి ఇళ్ళు తీసుకువద్దాం అంటే రావడం లేదని ఆరోపించారు. ధరణితో చాలా మంది చచ్చిపోతున్నారని, మంచి పథకాన్ని కుటుంబంకోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. ధరణి మంచి స్కీం. కానీ, అజమాయిషీ లేకుండా అయిపోయిందని సంజయ్ అన్నారు. రైతు బంధు ఇచ్చిన కేసీఆర్ ఉన్న వ్యవసాయ సబ్సిడీలు తీసివేశారని సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.

BJP Vs BRS : కేంద్రం, తెలంగాణ మధ్య ముదిరిన లెక్కల పంచాయితీ

బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఒక్కటి కాదు. బీఅర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీని ప్రజలు ఆదరిస్తున్నారని సంజయ్ చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుందని కోమటి‌రెడ్డి వెంకట్ రెడ్డి అంటున్నారని సంజయ్ అన్నారు. గద్దర్ అంటే మాకు గౌరవం. గద్దర్ కేసీఆర్‌ని ప్రశ్నించాలని సంజయ్ కోరారు. శంకరమ్మకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం కేసీఆర్ జిమ్మిక్ అంటూ విమర్శించారు. దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐలకు బీజేపీ‌కి ఎలాంటి సంబంధం లేదని బండి సంజయ్ చెప్పారు.