గ్రేటర్ ఎన్నికలను ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ తో పోల్చిన బండి సంజయ్

  • Published By: bheemraj ,Published On : November 25, 2020 / 02:28 PM IST
గ్రేటర్ ఎన్నికలను ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ తో పోల్చిన బండి సంజయ్

Updated On : November 25, 2020 / 2:53 PM IST

Bandi Sanjay sensational comments : జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారుతోంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గెలుపు కోసం నేతలు పరస్పర విమర్శలకు దిగుతున్నారు. బీజేపీ ఏకంగా మరో కొత్త వివాదాన్ని సృష్టించింది. పాతబస్తీపై సర్జికల్‌ స్ట్రైక్‌ నిర్వహిస్తామన్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బండి వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌, ఎంఐఎం, కాంగ్రెస్‌ ఎదురుదాడికి దిగాయి.



మరోసారి బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్ వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేసేది పక్కా అని బండి సంజయ్ అన్నారు. గ్రేటర్ ఎన్నికలను ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ తో పోల్చారు. మ్యాచ్ లో పాకిస్తాన్ గెలవాలా..ఇండియా గెలవాలా అని పేర్కొన్నారు. ఇండియా ఓడిపోతే నల్ల జెండాలతో నిరసన తెలిపిన వాళ్లను ఏం చేయాలని ఆయన ప్రశ్నించారు.



https://10tv.in/congress-in-shock-with-dubbaka-bypoll-result/
నిన్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్ ఎంఐఎంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మేయర్‌ పీఠం దక్కించుకుంటే పాతబస్తీపై సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తామన్నారు. రోహింగ్యాలను, పాకిస్తాన్‌ వారిని తరిమికొడతామని హెచ్చరించారు. పాతబస్తీలో రోహింగ్యాలు, పాకిస్తాన్‌ వాసులే ఎంఐఎంకు ఓట్లేస్తున్నారని ఆరోపించారు. గ్రేటర్ మేయర్‌ పీఠం దక్కించుకోగానే పాతబస్తీపై సర్జికల్‌ స్ట్రైక్‌ ఖాయమన్నారు.