Bandi Sanjay : బీఆర్ఎస్ ను ధైర్యంగా ఎదుర్కొనే పార్టీ బీజేపీనే : బండి సంజయ్

కేసీఆర్ లాగా సిట్ వేసి విచారణను తొక్కి పెట్టే పార్టీ బీజేపీ కాదని తెలిపారు. నిర్మల్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో సీఎం కేసీఆర్ చెప్పగలడా? అని ప్రశ్నించారు.

Bandi Sanjay : బీఆర్ఎస్ ను ధైర్యంగా ఎదుర్కొనే పార్టీ బీజేపీనే : బండి సంజయ్

Bandi Sanjay (9)

Bandi Sanjay comments : పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. పదవుల కోసం కాదు.. పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తనని చెప్పారు. బీజేపీకి ఓటు వేయాలని తెలంగాణ సమాజం డిసైడ్ అయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తో కాకుండా బీజేపీతో కొట్లాడుతోందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ను ధైర్యంగా ఎదుర్కొనేది బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు.

ఒక్కో నియోజకవర్గంలో బీజేపీకి ముగ్గురు, నలుగురు అభ్యర్థులున్నారని వెల్లడించారు. హుజూరాబాద్, మునుగోడు, జీహెచ్ఎంసీ సహా ఎక్కడా కాంగ్రెస్ లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఎక్కడ కనపడలేదని తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. కాంగ్రెస్.. అసలు ఎక్కడ ఉందన్నారు.

AP Government : ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో.. గ్రాస్ ఎన్ రోల్ మెంట్ రేషియో పెంచేందుకు మార్గదర్శకాలు జారీ

నిజామాబాద్ కార్పొరేషన్ లో ఉందా..? వరంగల్ కార్పొరేషన్ లో ఉందా..? కరీంనగర్ కార్పొరేషన్ లో ఉందా ..? ఎక్కడ ఉంది..? వారికి ఉన్న కార్పొరేటర్లు ఎంత మంది? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఫ్యామిలీపై విచారణ జరుగుతుందన్నారు. విచారణ సంస్థలు విచారణ చేస్తున్నాయని తెలిపారు.
నరేంద్రమోదీ ప్రభుత్వంలో దొంగలు తప్పించుకోలేరని పేర్కొన్నారు.

విచారణ సంస్థలతో బీజేపీకి సంబంధాలు ఉండవన్నారు. కేసీఆర్ లాగా సిట్ వేసి విచారణను తొక్కి పెట్టే పార్టీ బీజేపీ కాదని తెలిపారు. నిర్మల్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో సీఎం కేసీఆర్ చెప్పగలడా? అని ప్రశ్నించారు. నిర్మల్ లో కాంగ్రెస్ ను విమర్శించాల్సిన అవసరం కేసీఆర్ కు ఏమొచ్చిందన్నారు.

AP EAPCET : జూన్ 14న ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల

తెలంగాణ బీజేపీ కార్యకర్తల శ్రమ వృధాగా పోదని తెలిపారు. కార్యకర్తల లక్ష్యం, పార్టీ లక్ష్యం అధికారంలోకి రావటమేనని స్పష్టం చేశారు. గుజరాత్, యూపీ లాంటి రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ ఫేస్ ఎందుకు పనిచేయలేదని ప్రశ్నించారు. రాహుల్ వల్లనే గెలిచామని కర్ణాటక కాంగ్రెస్ నేతలే ఒప్పుకోవటం లేదన్నారు.